నాగ‌చైత‌న్య‌కు మామ దొరికేసాడు

Last Updated on by

రియ‌ల్ లైఫ్ లో మామ‌లు ఉన్నారు.. స‌మంత తండ్రి ఉన్నాడు.. నాగ‌చైత‌న్య‌కు ఇంకా మామ ఎక్క‌డ్నుంచి వ‌చ్చాడు.. ఎప్పుడు దొరికాడు అనే లేని పోని అనుమానాలు వ‌స్తున్నాయి క‌దా..! నిజంగానే ఇప్పుడు నాగ‌చైత‌న్య‌కు మామ దొరికేసాడు. అయితే ఇక్క‌డ విచిత్రం ఏంటంటే నిజం మామే.. సినిమాలోనూ మామ కావ‌డం..! ఈయ‌న ప్ర‌స్తుతం మూడు సినిమాల్లో న‌టిస్తున్నాడు. ముందు స‌వ్య‌సాచి పూర్తి చేస్తున్నాడు.. దాంతోపాటే శైల‌జా రెడ్డి అల్లుడు కూడా న‌డుస్తుంది. మారుతి దీనికి ద‌ర్శ‌కుడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత శివ‌నిర్వాణ‌తో ఓ సినిమా ఉంది.

ఇన్ని ఉండ‌గానే బాబీతో ఓ సినిమాకు క‌మిట‌య్యాడు నాగ‌చైత‌న్య‌. ఇందులో వెంక‌టేష్ మ‌రో హీరో. నిజమైన మామాఅల్లుళ్లే ఈ చిత్రంలో న‌టించ‌బోతున్నారు. ఇప్పుడు దీనికి టైటిల్ కూడా వెంకీ మామ అనే ప‌రిశీలిస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఇది అయితేనే క‌థ‌కు ప‌ర్ ఫెక్ట్ గా స‌రిపోతుంది ప్ల‌స్ అభిమానుల‌కు కూడా ఫుల్ కిక్ ఇస్తుంద‌ని న‌మ్ముతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. జై ల‌వ‌కుశ త‌ర్వాత క‌నిపించ‌డ‌మే మానేసిన బాబీ.. ఇప్పుడు ఈ మ‌ల్టీస్టార‌ర్ తో వ‌స్తున్నాడు. ప‌క్కా ప‌ల్లెటూరి క‌థ‌తో రానున్న ఈ చిత్రంలో వెంకీ, చైతూ మామా అల్లుళ్లుగానే న‌టించ‌బోతున్నారు. చైతూ స‌ర‌స‌న ర‌కుల్.. వెంక‌టేష్ కు జోడీగా కాలా ఫేమ్ హ్యూమాఖురేషి న‌టించ‌బోతున్నారు. ఇదే ఏడాది సినిమా మొద‌లు కానుంది. మ‌రి.. వెంకీ మామ అల్లుడితో క‌లిసి ఏం మాయ చేయ‌బోతున్నాడో..?

User Comments