నాగచైతన్య-సమంత జంటగా షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.2 ముహూర్తం ఫిక్స్ !!

Last Updated on by

రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ లవ్లీ కపుల్ గా నిలిచిన నాగచైతన్య-సమంతలు వివాహం అనంతరం మొదటిసారిగా జంటగా నటించనున్నారు. “నిన్ను కోరి” చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన దర్శకుడు శివ నిర్వాణ తన రెండో సినిమాగా తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా రూపొందిస్తుండడం విశేషం. ఈ చిత్ర ప్రారంభోత్సవం జూలై 23న హైద్రాబాద్ లో జరగనుంది.

రావు రమేష్, అవసరాల శ్రీనివాస్, పోసాని కృష్ణమురళి, శత్రు తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్న ఈ రోమాంటిక్ ఎంటర్ టైనర్ కి గోపీ సుందర్ సంగీత సారధ్యం వహిస్తుండగా.. ఈ చిత్రం నాగచైతన్య-సమంత జంటగా నటించనున్న నాలుగో సినిమా కావడం, పెళ్ళైన తర్వాత కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రారంభోత్సవానికి ముందు నుంచే మంచి అంచనాలు నమోదయ్యాయి.

నటీనటులు:
నాగచైతన్య, సమంత, రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల, పోసాని కృష్ణమురళి, శత్రు, రాజశ్రీ నాయర్, మణికిరణ్, సుహాస్ తదితరులు..

సాంకేతిక బృందం:

కథ-దర్శకత్వం: శివ నిర్వాణ

నిర్మాతలు: సాహు గారపాటి-హరీష్ పెద్ది

నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్

సంగీతం: గోపీ సుందర్

ఛాయాగ్రహణం: విష్ణు శర్మ

కళ: సాహి సురేష్

కూర్పు: ప్రవీణ్ పూడి

కో-డైరెక్టర్: లక్ష్మణ్ ముసులూరి

లైన్ ప్రొడ్యూసార్: నాగమోహన్

పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్

User Comments