నాగ చైతన్య పంచ్ రెడీ

Last Updated on by

ఈ రోజుల్లో సినిమా హిట్ కావాలంటే చాలా అంటే చాలా కొత్త‌ద‌నం ఉండాలి. రొటీన్ స్ట‌ఫ్ చూపించి చూడండంటే ప్రేక్ష‌కులు కూడా మొహం మీదే నో చెప్పేస్తున్నారు. ఇప్పుడు నాగ‌చైత‌న్య కూడా ఇదే చేస్తున్నాడు. ఈయ‌న చేస్తోన్న ఓ సినిమా ఇప్పుడు ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలోనే ఫ‌స్ట్ టైమ్ వ‌స్తోన్న క‌థ‌. బాడీలో ఓ భాగంతో సంబంధం లేకుండా హీరో ఉండ‌టం.. ఇదే క‌థ‌తో నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి తెర‌కెక్క‌బోతుంది. అర్థం కాలేదు క‌దా కాన్సెప్ట్. నాగ‌చైత‌న్య సినిమాకు స‌వ్య‌సాచి అనే అద్భుత‌మైన టైటిల్ పెట్టాడు చందూమొండేటి. అంటే రెండు చేతుల‌తోనూ త‌న నైపూణ్యం చూపించేవాడు అని అర్థం. భార‌తంలో ఒక్క అర్జునుడికి మాత్ర‌మే ఈ టాలెంట్ ఉంది. అందుకే అత‌డిని స‌వ్య‌సాచి అంటారు. ఇప్పుడు నాగ‌చైత‌న్య సినిమాలో కూడా ఇదే కాన్సెప్ట్ అని తెలుస్తోంది.Naga Chaitanya Savyasachi First Look Coming Soonఈ చిత్రంలో హీరో ఎడ‌మ‌చేయి త‌న ఆధీనంలో ఉండ‌దు. అంటే కుడిచేయికి.. ఎడ‌మ‌చేయికి అస‌లు సంబంధం ఉండ‌దు. తాను చేయాల‌నుకున్న‌ది అది చేస్తూ పోతుంది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే చైతూ ఎడ‌మ‌చేయికి కూడా కుడిచేయికి ఉన్నంత బ‌లం ఉంటుంది. కానీ ఆ చేయి బాడీ ఆధీనంలో ఉండ‌దు. దీనివ‌ల్ల హీరోకు ఎలాంటి క‌ష్టాలు వ‌చ్చాయి అనేది క‌థ‌. విన‌డానికే చాలా కొత్త‌గా ఉంది ఈ క‌థ‌. దీన్ని స‌రిగ్గా చెబితే తెలుగులో ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అయిపోతుంది స‌వ్య‌సాచి. ప్రేమ‌మ్ లాంటి క్లాస్ సినిమా త‌ర్వాత చందూ-చైతూ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న సినిమా ఇది. మార్చ్ 16న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రీ లుక్ సినిమాపై అంచ‌నాలు పెంచేసింది. ఇక రేపు సినిమా ఎంత మాస్ గా ఉండ‌బోతుందో చూడాలి. జూన్ 14న సినిమా విడుద‌ల కానుంది.

User Comments