సీక్రెట్ టాట్టూ డీకోడెడ్‌

Last Updated on by

ప్రేమికులు ర‌హ‌స్యంగా ప్రేమ‌లేఖ‌లు రాసుకోవ‌డం నేచుర‌ల్‌! ల‌వ్‌లెట‌ర్స్‌లో కోడ్ భాష‌లో ఒక‌రికొక‌రు చాలా విష‌యాల్ని చేర‌వేస్తుంటారు. ఫ‌లానా చోట క‌లుసుకుందామ‌నో.. ఫ‌లానా ప్లాన్ ఉంద‌నో లేఖ‌ల్లో కోడ్ లో రాస్తుంటారు. పూర్వాకాలంలో రాజులు …. రాణుల‌కు, ప్రియురాళ్ల‌కు ఈ త‌ర‌హాలోనే స‌మాచారం అందించేవారు. అది ప్రేమ లేఖ అయినా.. లేదూ శత్రురాజ్యాల సీక్రెట్స్ అయినా ఎవ‌రూ డీకోడ్ చేయ‌లేని కోడ్ భాష‌లో చేర‌వేస్తుండేవారు. అయితే వాట్సాప్ యుగంలో అలాంటిదేం లేదు. ఇప్పుడు ఏ లేఖ రాసినా వాట్సాప్‌లోనో లేదే ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌లోనో రాస్తున్నారు. కానీ చైతూ-స‌మంత‌ మాత్రం అలా కాదు.

Finally deciphered the meaning of this tattoo… So acc to Morse code. It’s 6-10-17 which is the marriage day of #chaysam 💕 . Correct me if I’m wrong @chay_akkineni @Samanthaprabhu2

చై- సామ్ మ‌ధ్య ప్రేమారంభంలో కోడ్ లాంగ్వేజ్ సాగేద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ఏమాయ చేశావే స‌మ‌యంలో మొద‌లైన స్నేహం.. అటుపై కోడ్ భాష‌లో ప్రేమ‌క‌బుర్లు చెప్పుకునే వ‌ర‌కూ వెళ్లి ఉంటుంద‌ని ఫ్యాన్స్ అంచ‌నా వేస్తున్నారు. ఇక‌పోతే తాజాగా చైతూ చేతిపై సీక్రెట్ కోడ్ గురించి అక్కినేని అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆ ప‌చ్చ‌బొట్టులో ఏదో ఉంది. ఆ టాట్టూ కోడ్‌ని డీకోడ్ చేయాల‌ని ఎంద‌రో ఫ్యాన్స్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒక ఫ్యాన్ మాత్రం చాలా స్పీడ్‌గా ఉన్నాడు ఈ ప‌నిలో. నాగ‌చైత‌న్య చేతిపై ఆ చుక్క‌ల‌ టాట్టూ అర్థం ఏమంటే.. “చై-సామ్‌ పెళ్లి రోజు 6-10-17 అని అర్థం“ అంటూ రాసుకొచ్చాడో అభిమాని. దానికి సామ్ అంతే స‌ర్‌ప్రైజింగ్‌గా ఆన్స‌ర్ చేసింది సామాజిక మాధ్య‌మంలో. వ్వావ్ ..  తెలుసుకోవాల‌న్న నీ ఆస‌క్తి ఆక‌ట్టుకుంది.. అని రిప్ల‌య్ ఇచ్చింది.

User Comments