చైతూ కిల్లింగ్ లుక్స్

నాగ‌చైత‌న్య ఇప్ప‌టి వ‌ర‌కు సూప‌ర్ స్టైలిష్ గా ఏ సినిమాలో అంత‌గా క‌నిపించ‌లేదు. ప్ర‌తీ సినిమాలో నార్మ‌ల్ గానే క‌నిపిస్తుంటాడు. కానీ ఇప్పుడు స‌వ్య‌సాచిలో మాత్రం ఏదో కొత్త‌గా ఉన్నాడు చైతూ. పెళ్లైన త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో మ‌నోడిలో ఏదో తెలియ‌ని మార్పు క‌నిపిస్తుంది. ఫేస్ లో కూడా చాలా మార్పులు వ‌చ్చాయి. ముఖ్యంగా స‌వ్యసాచిలో చైతూ లుక్స్ కు అంతా ఫిదా అయిపోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇన్ని సినిమాలు చేసినా.. ఇన్నేళ్ల‌లో ఎప్పుడూ లేనంత అందంగా క‌నిపిస్తున్నాడు చైతూ.

Naga Chaitanya Stunning Looks in Savyasachi

మీసాలు కాస్త పెంచి ఫ్రెష్ లుక్స్ తో చంపేస్తున్నాడు ఈ అక్కినేని వార‌సుడు. ఈ మ‌ధ్యే న్యూయార్క్ షెడ్యూల్ లో ఉన్న కొన్ని ఫోటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. అందులో చై లుక్స్ ఫుల్ కిక్ ఇస్తున్నాయి అంద‌రికీ. చందూమొండేటి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం జులైలో విడుద‌ల కానుంది. బాలీవుడ్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ ఇందులో హీరోయిన్. ఫ్లాపుల్లో ఉన్న చైత‌న్య‌కు ఈ చిత్ర విజ‌యం కీల‌కంగా మారింది. మ‌రి చూడాలిక‌.. ఈ ఫ్రెష్ లుక్స్ కు తోడు ఫ్రెష్ స్టోరీ కూడా చైకు హెల్ప్ అవుతాయేమో..?

Naga Chaitanya Stunning Looks in Savyasachi