Last Updated on by
అసలు ఎప్పుడైనా అనుకున్నారా.. ఏదో ఓ రోజు నాగచైతన్యకు పోటీగా సుమంత్ వస్తాడని..! చైతూకు ఉన్న మార్కెట్ లో సుమంత్ కు సగం కూడా లేదు. కానీ ఇప్పుడు చైతూకు పోటీగా సుమంత్ వచ్చాడు. అది కూడా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో. ఈ చిత్రంలో నాగేశ్వరరావ్ పాత్ర కోసం ముందు నాగచైతన్యను తీసుకోవాలనుకున్నాడు దర్శకుడు క్రిష్. మొన్నే మహానటిలో చేసాడు కదా.. అదే కొనసాగిస్తే ఓ పనైపోతుందని అనుకున్నాడు క్రిష్. కానీ ఇప్పుడు తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తుంది.
ఇందులో ఏఎన్నార్ క్యారెక్టర్ కోసం సుమంత్ ను తీసుకోవాలని ఆలోచనలో పడ్డాడు ఈ దర్శకుడు. దానికి ఒక్కటే కారణం.. చైతూ కంటే సుమంత్ కే ఎక్కువగా తాత పోలికలు ఉండటం. దాంతో ఈ విషయంలో నాగచైతన్యను వెనక్కి నెట్టి తాము రేస్ లో ముందుకొచ్చాడు సుమంత్. పైగా బాలయ్య కూడా సుమంత్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఎన్టీఆర్ బయోపిక్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు క్రిష్. జనవరికి సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.
User Comments