నిజమే.. బాహుబలిలో నాగచైతన్య

Naga Chaitanya worked Baahubali movie

టాలీవుడ్ ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన బాహుబలి సినిమాను ఇప్పుడప్పుడే మర్చిపోవడం కష్టమనే అనాలి. అంతలా తెలుగు ప్రజలను ప్రభావితం చేసిన బాహుబలి ఏదొక విధంగా తన ఉనికిని చాటుకుంటుంటే ఉంటుంది. ముఖ్యంగా బయట జనాల కంటే ఎక్కువగా మిగిలిన ఫిల్మ్ మేకర్స్ బాహుబలిని తమ సినిమాల్లో ఏదో రకంగా వాడేస్తుండటంతో.. బాహుబలి మళ్ళీ మళ్ళీ అలరిస్తూనే ఉంటుంది. అందుకు ఉదాహరణగా ఆ మధ్య నేచురల్ స్టార్ నాని తన ‘మజ్ను’ సినిమా విషయంలో బాహుబలిని ఏ రకంగా వాడుకున్నాడో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏకంగా సినిమాలోకి రాజమౌళిని దింపేసి.. ఆయన అసిస్టెంట్ గా బాహుబలి సినిమాకు పనిచేసినట్లు మజ్ను సినిమాలో హీరో క్యారెక్టర్ ను డిజైన్ చేసేశారు.
ఇక ఇప్పుడేమో అదే ఫార్ములాను అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా ఫాలో అయ్యాడని తెలియడం విశేషం. ఈ మేరకు వచ్చే నెల 8న రిలీజ్ కాబోతున్న తన లేటెస్ట్ మూవీ ‘యుద్ధం శరణం’ లో నాగచైతన్య బాహుబలి సినిమాకు పనిచేసే డ్రోన్ ఆపరేటర్ గా కనిపిస్తాడట. అంతేకాకుండా సినిమాలో చైతూ ఇంట్రడక్షన్ సీన్ కూడా బాహుబలి సెట్ లోనే స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో చైతూను ఇలా బాహుబలి సినిమాకు పనిచేసే కుర్రాడిగా చూపించాలనే ఐడియాను రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ఇచ్చాడని తెలియడం విశేషం. దీంతో ఈ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తోన్న కార్తికేయ మాటను ఓకే చేస్తూ.. డైరెక్టర్ కూడా హీరో క్యారెక్టర్ ను అలా డిజైన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. మరి ఈ ఫీట్ రేపు థియేటర్స్ లో ఎటువంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. నాని రేంజ్ లో అందుకోవాలంటే మాత్రం కొంచెం కష్టమేనేమో అనిపిస్తోంది.