ఛ‌లో గురు ప్రేమ‌కోస‌మే ఈ జీవితం.. 

Last Updated on by

అవును.. నాగార్జున హ‌లో గురు అంటే ఇప్పుడు నాగ‌శౌర్య మాత్రం ఛ‌లో గురు అంటున్నాడు. ఈయ‌న న‌టించిన ఛ‌లో ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత కుర్రాడి జాత‌కం మారిపోయేలాగే క‌నిపిస్తుంది. కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు సాలిడ్ హిట్ కోసం వేచి చూస్తూనే ఉన్నాడు నాగ శౌర్య‌. ఇప్పుడు ఛ‌లో అది తీర్చేలాగే క‌నిపిస్తుంది. విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే క‌చ్చితంగా కామెడీ ఎక్కువ‌గా ఉంటుంద‌నే విష‌యం అర్థ‌మైపోతుంది. కాలేజ్ ల‌వ్ కు తోడు.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో తెలుగు, త‌మిళ వాళ్ల‌పై వేసిన పంచ్ లు.. సినిమాల‌పై పేల్చిన డైలాగులు బాగానే పేలాయి. ముఖ్యంగా బాషా తెలుగులో చేసినంత ఈజ్ తో త‌మిళ్ లో ర‌జినీ చేయ‌లేక‌పోయాడ్రా అనే డైలాగ్.. తెలుగు వాళ్లే గొప్పోళ్లురా ఎందుకంటే బాహుబ‌లి తీసారు క‌దా అనే డైలాగ్.. మా త‌నిఒరువ‌న్ ను కాపీ కొట్టి ఇక్క‌డ తీసార్రా అని వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ బాగానే పేలాయి. ఇవ‌న్నీ చూస్తుంటే గురువు త్రివిక్ర‌మ్ ప్ర‌భావం వెంకీ కుడుముల‌పై బాగానే ప‌డిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది.

ఇక ట్రైల‌ర్ అంతా కామెడీతోనే నింపేసాడు ద‌ర్శ‌కుడు. హీరోయిన్ ర‌ష్మిక కూడా చాలా అందంగా ఉంది. ఇక శౌర్య మాస్ హీరో అయిపోవాల‌నే ట్ర‌య‌ల్స్ లో ఉన్న‌ట్లు అర్థ‌మైపోతుంది. త‌మిళ నేప‌థ్యం కావ‌డంతో అక్క‌డి ఆర్టిస్టుల‌ను కూడా బాగానే పెట్టుకున్నాడు ద‌ర్శ‌కుడు. మొత్తానికి మ‌న‌సుకు న‌చ్చిన క‌థ‌ను సొంత నిర్మాణ సంస్థ‌లోనే చేసాడు నాగ‌శౌర్య‌. మ‌రి ఈయ‌న ఆశ‌ల్ని ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు తీరుస్తుందో చూడాలిక‌..! ఫిబ్ర‌వ‌రి 2న ఛ‌లో విడుద‌ల కానుంది.

User Comments