సాయి పల్లవితో నాగ శౌర్య ఈగో ప్రాబ్లమ్

కణం సినిమా ప్ర‌మోష‌న్ కు సాయిప‌ల్ల‌వి రాదేమో అనుకున్నారంతా. కానీ ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ అయింది. సాయిప‌ల్ల‌వి వచ్చింది.. కానీ హీరో నాగ‌శౌర్య రాలేదు. ఇది కాస్త షాక్ ఇచ్చే విష‌య‌మే. ఈ చిత్ర షూటింగ్ టైమ్ లో సాయిప‌ల్ల‌వితో కొన్ని ఇబ్బందులు వ‌చ్చాయి హీరో శౌర్య‌కు. ఈ విష‌యం ఓపెన్ గానే చెప్పాడు ఈ హీరో. త‌న కెరీర్ లో బాగా చిరాకు తెప్పించిన హీరోయిన్ సాయిప‌ల్ల‌వి అంటూ ఫైర్ అయ్యాడు. ఈ విష‌యం అక్క‌డా ఇక్క‌డా ప‌డి ప‌ల్ల‌వి వ‌ర‌కు కూడా వెళ్లింది. దీనిపై ఆమె ఏం స్పందించ‌లేదు. అలా ఎందుకు నాగ‌శౌర్య‌కి అనిపించిందో త‌న‌కు తెలియ‌ద‌ని త‌ప్పించుకుంది. ఇంత జ‌ర‌గ‌డంతో క‌ణం ప్ర‌మోష‌న్ కు ప‌ల్ల‌వి వ‌స్తుందో రాదో అనుకున్నారంతా. కానీ విచిత్రంగా సాయిప‌ల్ల‌వి వ‌చ్చింది.. కానీ నాగ‌శౌర్య మాత్రం రాలేదు.

ఛ‌లో స‌క్సెస్ త‌ర్వాత మ‌నోడి మార్కెట్ కూడా బాగానే పెరుగుతుంది. ఈ టైమ్ లో కానీ మ‌రో హిట్ ప‌డితే ఖచ్చితంగా శౌర్య రేంజ్ నెక్స్ట్ స్టేజి కి వెళ్తుంది. కానీ సాయిప‌ల్ల‌వి ఉంటే ఆ సినిమాలో హీరోను తినేస్తుంది. అందుకే నాగ‌శౌర్య కూడా క‌ణం సినిమాపై ఆశ‌లు వ‌దిలేసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. త‌ను ప్ర‌మోట్ చేసినా మీడియా కూడా సాయిప‌ల్ల‌వినే ప్ర‌మోట్ చేస్తార‌ని ముందే ఫిక్సైపోయాడు ఈ హీరో. దాంతో క‌ణం సినిమాను పూర్తిగా సాయిపల్ల‌వికే వ‌దిలేసాడు ఈ హీరో. హైద‌రాబాద్ లో జ‌రిగిన ప్రీ రిలీజ్ వేడుక‌కు కూడా నాగ‌శౌర్య రాలేదు. ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ తో పాటు సాయిప‌ల్ల‌వి, సినిమాలో న‌టించిన పాప విరోనికా ఈ వేడుక‌కు వ‌చ్చారు. తీరు చూస్తుంటే ఇక‌పై ప్ర‌మోష‌న్ భారం మొత్తం సాయిప‌ల్ల‌వి త‌న భుజాల‌పై మోసేలా క‌నిపిస్తుంది. కానీ నాగ శౌర్య ఇలా చేయడం తప్పు నిర్మాతని దృష్టిలో పెట్టుకొని ఏ పనైనా చేయాలి. కానీ నాగ శౌర్య ఇలా చేయడం తప్పు నిర్మాతని దృష్టిలో పెట్టుకొని ఏ పనైనా చేయాలి. నిర్మాతలు బాగుంటేనే ఇలాంటి హీరోలు ఇండస్ట్రీలోకి వస్తారు. ఛలో తో నాగ శౌర్య కూడా నిర్మాత అయ్యాడు కాబట్టి నిర్మాత బాధలు తెలుసుకొంటాడు అని ఆశిద్దాం.