దర్శకుడిగా మారిన నాగశౌర్య

Last Updated on by

ఈ రోజుల్లో హీరోలు కేవ‌లం త‌మ ప‌ని మాత్ర‌మే తాము చూసుకుంటూ.. ద‌ర్శ‌కుల ప‌ని వాళ్ల‌నే చేసుకోనిస్తున్నారు. కానీ కొంద‌రిలో మాత్రం ద‌ర్శ‌కులు కూడా దాగి ఉన్నారు. నాని లాంటి వాళ్లు ద‌ర్శ‌కుల‌కు కూడా కీల‌క‌మైన స‌ల‌హాలు ఇస్తుంటారు. మ‌రీ క‌థ‌ను మార్చేయ‌డం కాదు కానీ క‌థ‌లో అవ‌స‌రం అనిపించిన మార్పులు అయితే చేయిస్తుంటారు. ఇప్పుడు ఇదే కోవ‌లోకి నాగ‌శౌర్య కూడా వ‌చ్చాడు. ఈ కుర్ర హీరోలో ఇన్నాళ్ళూ కేవ‌లం న‌టున్ని మాత్ర‌మే చూసారంతా. కానీ శౌర్య‌లో అద్భుత‌మైన ద‌ర్శ‌కుడు కూడా ఉన్నాడు. తాజాగా మ‌ద‌ర్స్ డే కానుక‌గా అంతా శుభాకాంక్ష‌లు చెప్పి.. సెల్ఫీలు దిగి సంద‌డి చేస్తే నాగ‌శౌర్య మాత్రం మంచి షార్ట్ ఫిల్మ్ తో వ‌చ్చాడు.

భూమి పేరుతో వ‌చ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ ను ముందు ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. నాగ‌శౌర్య ద‌ర్శ‌కుడు అంటే ఏం చేసుంటాడులే అనుకున్నారంతా. కానీ చూసిన త‌ర్వాత మ‌నోడిలో మంచి ద‌ర్శ‌కుడు కూడా ఉన్నాడ‌ని అర్థ‌మైపోతుంది. ప్ర‌తీ చిన్న ఎమోష‌న్ ను కూడా అద్భుతంగా క్యారీ చేసాడు శౌర్య‌. పైగా క‌థ కూడా చాలా బాగుంది. అమ్మ‌ల దినోత్స‌వం రోజు.. అమ్మాయిల గొప్ప‌త‌నం చెప్పేలా ఉంది ఈ భూమి. ఆ క‌థను చెప్ప‌డం కంటే చూస్తే ఇంకా చాలా బాగుంటుందేమో..? ఎందుకంటే నాగ‌శౌర్య లాంటి యంగ్ హీరో నుంచి ఇలాంటి ఎమోష‌న‌ల్ షార్ట్ ఫిల్మ్ మాత్రం ఊహించ‌లేం..! ఆయ‌న ఆలోచించిన తీరుకు మాత్రం నిజంగా స‌లాం చెప్పాల్సిందే..!

User Comments