నాగ‌శౌర్య.. పాపం నిహారిక‌

Last Updated on by

ఈ రోజుల్లో ఓ సినిమాను ఎలా తీసామ‌న్న‌ది కాదు.. ఎంత బాగా ప్ర‌మోట్ చేసుకున్నాం అన్న‌దే కీల‌కం. ఈ విష‌యంలో నాగ‌శౌర్య చాలా బెట‌ర్. తాను నిర్మించిన ఛ‌లో సినిమాను ఓ రేంజ్ లో ప్ర‌మోట్ చేసుకున్నాడు ఈ కుర్ర హీరో. నెల రోజులుగా ఇంకే ప‌ని పెట్టుకోకుండా ఇదే ప‌నిమీదున్నాడు. అయితే ఉన్న‌ట్లుండి తెర‌పైకి నాగ‌శౌర్య‌-నిహారిక పెళ్లి ఎందుకు వ‌చ్చింది అనేది ఇప్పుడు అంద‌రిలోనూ వ‌స్తున్న అనుమానం. ఇది కూడా కాస్త ఆలోచిస్తే స్ట్రాట‌జీ తోనే చేసిన‌ట్లుగా అనిపిస్తుంది. ఒక మ‌న‌సు సినిమా వ‌చ్చి రెండేళ్లు దాటిపోయింది. ఈ సినిమా వ‌చ్చిన కొత్త‌లో శౌర్య‌-నిహారిక మ‌ధ్య‌లో కుచ్ కుచ్ హోతా హై అనే టాక్ అయితే వ‌చ్చింది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ అది తెర‌పైకి రాలేదు. ఇప్పుడు స‌రిగ్గా ఛ‌లో విడుద‌ల‌కు ముందే మ‌ళ్లీ ఇది వినిపించింది.

ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ వ‌చ్చిందంటే ఛ‌లో ప్ర‌మోష‌న్ కోస‌మే అనే వాద‌న కూడా వినిపిస్తుంది. లేక‌పోతే ఇప్ప‌టికిప్పుడు నాగ‌శౌర్య‌తో నిహారిక‌కు లింక్ పెట్టాల్సిన ప‌నిలేదు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో శౌర్య కూడా స్పందించాడు. త‌న‌కు ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్య‌మే లేద‌ని తేల్చేసాడు ఈ కుర్ర హీరో. పైగా ఇంట్లో చూసిన అమ్మాయినే తాను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పాడు నాగ‌శౌర్య. మ‌రి దీన్ని ఏం అనుకోవాలి..? చాలా తెలివిగా సమాధానం చెప్పాడు శౌర్య. తన పై నిహారిక పై వచ్చే గాసిప్స్ కి మాత్రం చెక్ పెట్టలేదు. ఎందుకంటే నాగ‌శౌర్య పేరు మారుమోగిపోవాలి తన ఛలో మూవీకి ఫ్రీ ప్రమోషన్ కావాలి. ఎంతయినా ఛలో టీం ప్రొమోషన్స్ లో ఎక్సపర్ట్స్ లా ఉన్నారు. మరి నాగ‌శౌర్య తర్వాత అయినా ఈ గాసిప్ పై క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.

User Comments