పోలీసోడి కూతురితో ఛ‌లో

Last Updated on by

ఛ‌లో, అమ్మ‌మ్మ‌గారిల్లు చిత్రాల‌తో చ‌క్క‌ని విజ‌యాలు అందుకున్నాడు నాగశౌర్య‌. ప్ర‌స్తుతం మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకునే త‌ప‌న‌లో ఉన్నాడు. ఆ క్ర‌మంలోనే అత‌డు టాలీవుడ్‌కి ప‌లువురు న‌వ‌త‌రం క‌థానాయిక‌ల్ని పరిచ‌యం చేస్తున్నాడు. ఇదివ‌ర‌కూ ఛ‌లో చిత్రంతో ర‌ష్మిక మంద‌న‌ను క‌థానాయిక‌గా ప‌రిచ‌యం చేశాడు. సొంత బ్యాన‌ర్ ఐరా క్రియేష‌న్స్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం త‌న కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది.

తాజాగా `న‌ర్త‌న‌శాల‌` చిత్రంతో ఓ కొత్త‌మ్మాయిని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నాడు. పేరు క‌శ్మీరా ప‌ర్ధేశి. నాగ‌శౌర్య స‌ర‌స‌న న‌టిస్తున్న ఈ అమ్మాయి పూణేకు చెందిన ఓ పోలీసాఫీస‌ర్ కూతురు. సినిమాల‌పై ఫ్యాష‌న్‌తో ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింది. క్రేజీ యువ‌హీరో స‌ర‌స‌న ఎంట్రీ ఇస్తోంది. ఇటీవ‌లే శౌర్య – ప‌ర్ధేశి జంట‌పై ఖ‌రీదైన సెట్‌లో పాట‌ను చిత్రీక‌రించారు. దాదాపు 50ల‌క్ష‌ల బ‌డ్జెట్‌తో సెట్‌ను ఈ పాట కోసం డిజైన్ చేశారు. త్వ‌ర‌లోనే కొన్ని పాట‌ల్ని ఇటలీలో తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. శౌర్య ప‌రిచ‌యం చేస్తున్న కొత్త అంద‌గ‌త్తె క‌శ్మీరా టాలీవుడ్‌లో ఏ స్థాయిలో దూసుకుపోతుందో చూడాలి.

User Comments