నాగ‌చైత‌న్యతో ప‌ర‌శురామ్ లాంచ్

వెంకీమామ రిలీజై రిజ‌ల్ట్ తేలిపోయింది. ఇక నాగ‌చైత‌న్య త‌దుప‌రి చిత్రాల‌పై దృష్టి సారించాడు. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ స్టోరి లో న‌టిస్తున్న చైతూ త‌దుప‌రి త‌న కెరీర్ 20వ సినిమాకి సంత‌కం చేశాడు. ఈ చిత్రానికి గీత గోవిందం ఫేం ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై రామ్ ఆచంట‌, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఆ మేర‌కు నిర్మాత‌ల నుంచి అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ పోస్ట‌ర్ లో చైత‌న్య‌-ప‌ర‌శురామ్ – 14రీల్స్ అధినేత‌లు ఉన్నారు.

ఈ సినిమాలో క‌థానాయిక ఎవ‌రు? ఇత‌ర కాస్టింగ్ .. సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది. నాగ‌చైత‌న్య – క‌మ్ముల‌… నాగ‌చైత‌న్య‌- ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ సినిమాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక గీత గోవిందం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాతా ప‌ర‌శురామ్ ఏడాది పాటు వేచి చూడాల్సొచ్చింది. ఎట్ట‌కేల‌కు అన్ని డైల‌మాల నుంచి బ‌య‌ట‌ప‌డి చైతూతో సినిమాని ఖాయం చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రం.