మామా అల్లుళ్లు హీరోలుగా సినిమా

Last Updated on by

ప్రేమ‌మ్ త‌ర్వాత మ‌రొక‌సారి మామా అల్లుళ్లు వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య క‌లిసి న‌టిస్తార‌నే మాట ఎప్ప‌ట్నుంచో వినిపిస్తోంది. ప‌లువురు ద‌ర్శ‌కుల పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అయితే ఎంత‌కీ అధికారికంగా అనౌన్స్‌మెంట్ రాకపోయేస‌రికి ఆ కాంబోలో ఇప్ప‌ట్లో సినిమా ఉండ‌దేమో అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దానికితోడు అటు నాగ‌చైత‌న్య‌, ఇటు వెంక‌టేష్ జోరుగా కొత్త సినిమాల‌కి ప‌చ్చ‌జెండా ఊపుతూ వెళ్లారు. అది చూసి ఇక ఈ కాంబోలో సినిమా క్యాన్సిల్ అయినట్టే అనుకున్నారంతా. కానీ ఆ అనుమానాల్ని ప‌టాపంచలు చేస్తూ ఉగాది రోజున రామానాయుడు స్టూడియో నుంచి ఓ కొత్త క‌బురు వినిపించింది. మామాఅల్లుళ్లు క‌లిసి న‌టించ‌బోతున్నార‌ని! అంత‌కంటే గుడ్ న్యూస్ ప్యాన్స్‌కి ఇంకేముంటుంది? అయితే ఎవ్వ‌రూ ఊహించ‌ని విష‌యం ఏంటంటే ఆ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం. కోన వెంక‌ట్ రాసిన క‌థ‌తో బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. జై ల‌వ‌కుశ త‌ర్వాత బాబీ కొత్త సినిమాని ప్ర‌క‌టించ‌లేదు. సాయిద‌ర‌మ్ తేజ్‌తో ఓ సినిమా చేస్తార‌ని ప్ర‌చారం సాగినా అది కుద‌ర్లేదు. ఎట్ట‌కేల‌కి కాస్త ఆల‌స్య‌మైనా మంచి కాంబోలోనే సినిమాని సెట్ చేసుకొన్నాడు బాబీ. ఈ చిత్రం మేలో ఆరంభం కాబోతోంది.

User Comments