చైతూ రిస్క్ చేస్తున్నాడా?

Last Updated on by

ఒకే నెల‌లో ఒకే హీరో న‌టించిన రెండు సినిమాలు రిలీజైతే అందుకు ట్రేడ్ హ‌ర్షిస్తుందా? అంటే కుద‌ర‌నేకుద‌ర‌ద‌ని విశ్లేషిస్తున్నారు. కానీ అలాంటి డేరింగ్ ఫీట్‌కి రెడీ అవుతున్నాడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. ఈ యంగ్ హీరో న‌టిస్తున్న రెండు సినిమాలు ఒకే నెల‌లో రిలీజ‌వుతున్నాయి. ఆగ‌ష్టు 17న `స‌వ్య‌సాచి` రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతుండ‌గా, అదే నెల‌ 31న `శైల‌జారెడ్డి అల్లుడు` చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఇరు సినిమాల రిలీజ్‌ల‌కు కేవ‌లం రెండు వారాల గ్యాప్ మాత్ర‌మే ఉంది. అంటే `స‌వ్య‌సాచి` సినిమా బావున్నా `శైల‌జారెడ్డి అల్లుడు` వ‌చ్చేప్ప‌టికి థియేట‌ర్ల ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌ప్ప‌ద‌ని విశ్లేషిస్తున్నారు. ఈ సినిమాలే కాదు, ఇత‌ర‌త్రా సినిమాల నుంచి థియేట‌ర్ల వార్ ఉండ‌నే ఉంటుంది కాబ‌ట్టి కొద్దిపాటి ఆందోళ‌న ట్రేడ్‌లో వ్య‌క్త‌మ‌వుతోందిట‌. ఈ గ్యాప్‌ని మ‌రికాస్త పెంచితే బావుంటుంద‌ని పంపిణీదారుల్లోనూ చ‌ర్చ సాగుతోందిట‌.

User Comments