Last Updated on by
వర్మ నాగార్జున సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఆఫీసర్ అంటూ పక్కా రఫ్ లుక్ లో వచ్చేసాడు మన్మథుడు. చూస్తుంటే కొత్తగా అనిపించట్లేదు కానీ వర్మ గత సినిమాలు.. రీసెంట్ ట్రాక్ రికార్డులతో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో ప్రత్యేకథ ఉందనే విషయం మాత్రం అర్థమైపోతుంది. ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు వర్మ. శ్రీదేవి మరణం కారణంగా రెండు రోజుల కిందే రావాల్సిన ఫస్ట్ లుక్ రాలేదు. ఇప్పుడు అది విడుదల చేసాడు దర్శకుడు వర్మ. గన్.. సిస్టమ్ లాంటి పవర్ ఫుల్ టైటిల్స్ వినిపించినా కూడా తన స్టైల్ లో ఆఫీసర్ అనే టైటిల్ కే ఓటేసాడు వర్మ. ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తయింది.
ప్రస్తుతం శ్రీదేవి చనిపోయిన బాధలో ఉన్న వర్మ.. షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ సెట్ లో అడుగు పెట్టనున్నాడు ఈ దర్శకుడు. మార్చ్ 30 నాటికి సినిమా షూట్ పూర్తి చేయాలని వర్మను కోరాడు నాగార్జున. ఎందుకంటే ఈయన ఇప్పటికే నాని సినిమాకు కమిటయ్యాడు. అతడితో చేయాల్సిన మల్టీస్టారర్ కు ముహూర్తం కూడా పెట్టారు. అశ్వినీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఇక్కడ వర్మ లేట్ చేస్తే అక్కడ నాని బుక్ అవుతాడు. అందుకే ఈ చైన్ లింక్ ను త్వరగా తెంపాలని చూస్తున్నాడు నాగార్జున. మే 25న ఆఫీసర్ విడుదల కానుంది. మరి చూడాలిక.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో.. నాగార్జున ఆశలను తీరుస్తుందో లేదో..?
User Comments