నాగార్జున‌.. ది క్యాన్స‌ర్ హీరో..!

Last Updated on by

ఛీఛీ.. అదేం టైటిల్..? ఆయ‌న రాశి కానీ క్యాన్స‌రా ఏంటి.. అందుకే అలా అంటున్నారా అనుకుంటున్నారా..? అవేం కాదు.. కానీ నాగార్జున మాత్రం క్యాన్స‌ర్ హీరోనే. దాని వెన‌క ఓ క‌థ కూడా ఉంది. ఈ మ‌ధ్య మ‌న ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల‌కు క్యాన్స‌ర్ రావ‌డం చూస్తూనే ఉన్నాం. వ‌ర‌స‌గా హీరోయిన్ల‌కే అది వ‌స్తుంది కూడా. ఇప్పుడు సోనాలి బింద్రే కూడా దీంతో పోరాడుతుంది. న్యూ యార్క్ లో ఈమె ప్ర‌స్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే నాగ్ తో దీనికి సంబంధం ఏంట‌నే అనుమానం రావ‌చ్చు. గ‌త రెండు ద‌శాబ్దాల‌లో క్యాన్స‌ర్ బారిన పడిన ప్ర‌తీ హీరోయిన్ తోనూ రొమాన్స్ చేసాడు నాగార్జున‌. సోనాలి బింద్రేతో అప్ప‌ట్లో నాగ్ న‌టించిన మ‌న్మ‌థుడు కామెడీ క్లాసిక్ గా నిలిచింది.

ఇక మ‌రో క్యాన్స‌ర్ హీరోయిన్ గౌత‌మితో అప్ప‌ట్లో చైత‌న్య సినిమాలో న‌టించాడు నాగార్జున‌. ఇది ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ నాగ్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక మ‌నీషా కోయిరాలా కూడా క్యాన్స‌ర్ తో పోరాడి గెలిచింది. ఈమెతో క్రిమిన‌ల్ సినిమాలో న‌టించాడు నాగార్జున‌. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ హీరో. ఈ ముగ్గురే కాదు.. మ‌మ‌త మోహ‌న్ దాస్ తో కూడా న‌టించాడు నాగార్జున. కేడీ సినిమాలో వీళ్లు క‌లిసి రొమాన్స్ చేసారు. ఈమె కూడా క్యాన్స‌ర్ నుంచి బ‌య‌ట ప‌డింది. ఇలా క్యాన్స‌ర్ నుంచి బ‌య‌టప‌డిన‌.. సోకిన హీరోయిన్ల‌తో న‌టించి క్యాన్స‌ర్ హీరో అయ్యాడు నాగార్జున‌ అని కొందరు అంటున్నారు.. కానీ ఆ హీరోయిన్స్ కు క్యాన్సర్ సోకితె నాగార్జున బాద్యుడు అవ్వడు కదా ఇది తెలుసుకొంటె చాలా మంచిది.

User Comments