త్రివిక్ర‌మ్‌తో కింగ్‌ గ్యాప్.. ప్రూఫ్ ఇదే

కింగ్ నాగార్జున .. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మ‌ధ్య సాన్నిహిత్యం తెలిసిందే. నాగార్జున `మ‌న్మ‌ధుడు` చిత్రానికి ఆయ‌నే మాట‌లు అందించారు. విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌.. త్రివిక్ర‌మ్ పంచ్ డైలాగులు ఆ చిత్రానికి ప్ల‌స్ అయ్యాయి. అయితే ఇటీవ‌ల ఏమైందో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అప్ప‌ట్లో అఖిల్ రెండో సినిమా త్రివిక్ర‌మ్ తో ఉంటుంద‌ని ప్ర‌చారం సాగింది. ఆ త‌ర్వాత మూడో సినిమా విష‌యంలోనూ త్రివిక్ర‌మ్ పేరు వినిపించింది. ఆ రెండుసార్లు త్రివిక్ర‌మ్ హ్యాండిచ్చార‌ని భావించారు.

మొత్తానికి అలాంటి కార‌ణ‌మేదో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ పెర‌గ‌డానికి కార‌ణం కావొచ్చు అని తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. మొన్న `మ‌న్మ‌ధుడు 2` ప్రీరిలీజ్ ఈవెంట్ లో త్రివిక్ర‌మ్ క‌నిపించ‌లేదు. అలాగే ఈ వేదిక వ‌ద్ద మ‌న్మ‌ధుడు ద‌ర్శ‌కుడు విజ‌య్ భాస్క‌ర్ మాత్ర‌మే హైలైట్ అయ్యారు. వేదిక‌పై మాట్లాడిన నాగార్జున మ‌న్మ‌ధుడు సినిమా గురించి ప్ర‌స్థావిస్తూ విజ‌య్ భాస్క‌ర్ పేరును మాత్ర‌మే ప్ర‌స్థావించారు. అయితే అక్క‌డ ఈవెంట్ హ‌డావుడిలో మ‌ర్చిపోయి ఉంటారులే అనుకుంటే.. అది నిజం కాదు.. వాస్త‌వంగా కింగ్ మ‌న‌సులో ఏదో ఉంద‌ని నేటి ఇంట‌ర్వ్యూ మ‌రోసారి ప్రూవ్ చేసింది.

మ‌న్మ‌ధుడు 2 ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో త్రివిక్ర‌మ్ తో గ్యాప్ విష‌య‌మై మీడియా నుంచి ఓ ప్ర‌శ్న ఎదురైంది. దానికి స్పందిస్తూ.. “మన్మధుడు కథ నాకు వినిపించింది విజయ్ భాస్కర్.. ప్ర‌తిరోజూ నన్ను కలిసి నాతో పంచ్ లు చెప్పించింది కూడా ఆయనే. అందుకే ఆయన గురించే మాట్లాడాను“ అని అన్నారు. వెంట‌నే చ‌ర్చ కొన‌సాగ‌కుండా క‌ట్ చేస్తూ.. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్!! అంటూ మ్యాట‌ర్ ని డైవ‌ర్ట్ చేసేశారు. త్రివిక్ర‌మ్ గురించి మాట్లాడే ఆస‌క్తి కూడా లేన‌ట్టుగా క‌ట్ చేసేశారు. దీంతో మ‌రోసారి ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ కంటిన్యూ అవుతోంద‌ని అర్థ‌మైంది. ఇంత‌కీ నాగ‌చైత‌న్య‌తో సినిమా చేయ‌లేద‌నా? లేక అఖిల్ తో ప‌ని చేయ‌లేద‌నా? లేక త‌న‌తోనే సినిమా చేయ‌మ‌ని అడిగితే కాద‌న్నాడా? అస‌లు నిజం ఏంటో తేలాల్సి ఉంది. మ‌న్మ‌ధుడు 2 ఆగ‌స్టు 9న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.