`83`లోకి నాగార్జున వచ్చేశాడు

బాలీవుడ్లో తెరకెక్కుతున్న ఓ సినిమా నిర్మాణంలో నాగార్జున భాగమయ్యాడు. రణ్వీర్ సింగ్, దీపికా పదుకుణే తదితరులు నటిస్తున్న సినిమా అది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా ఏదో కాదు… `83`. తెలుగు నిర్మాతలు విష్ణువర్ధన్ ఇందూరి, మధు మంతెన తదితరులు కలిసి రూపొందిస్తున్నారు.

ఇండియాకి క్రికెట్లో తొలి వరల్డ్ కప్ని అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా, 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ చిత్రానికి నాగార్జున సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. తెలుగులో తన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థపై చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఆ విషయాన్ని నాగ్ స్వయంగా ప్రకటించాడు. ఈ యేడాది ఏప్రిల్ 10న చిత్రం విడుదల కాబోతోంది. నాగార్జున నటించిన బాలీవుడ్ చిత్రం `బ్రహ్మాస్త్ర` కూడా ఈ యేడాదే విడుదల కాబోతోంది.