కింగ్‌-క‌ళ్యాణ్‌రామ్ షాకింగే!

Last Updated on by

కింగ్ నాగార్జున- నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ మ‌ల్టీస్టార‌ర్ ఏమైన‌ట్టు? ఇంత‌కీ ఏం జ‌రుగుతోంది? ప్రాజెక్టులో క‌ద‌లిక ఏమైనా ఉందా? ఒక్క‌డుగైనా ప‌డిందా? అస‌లింత‌కీ తాజా అప్‌డేట్ ఏంటి? .. ఇన్ని ప్ర‌శ్న‌ల‌కు ఒకే స‌మాధానం.. ఇక ఈ ప్రాజెక్టు గురించి డౌట్ అఖ్క‌ర్లేద‌నే.

కింగ్ నాగార్జున మ‌ల్టీస్టార‌ర్ల విష‌యంలో ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు వెళుతున్నారు. బిజినెస్ వ‌ర్గాల్లో బంతాట‌ను సాఫీగా ఆడాలంటే కుర్ర‌హీరోల‌ను కలుపుకుని ముందుకు పోవాల‌న్న తెలివైన ఎత్తుగ‌డ‌ను అనుస‌రిస్తున్నారు. అలా చేస్తే త‌న‌కు హిట్టు లేక‌పోయినా, యువ‌హీరోల దూకుడు అయినా క‌లిసొస్తుంద‌న్న గేమ్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇక‌పోతే హిట్టొచ్చిన‌ప్పుడు వ‌రుస‌గా సోలో సినిమాలు చేయ‌డం, లేన‌ప్పుడు మ‌ల్టీస్టార‌ర్లు చేయ‌డం అన్న ఫార్ములా త‌న‌కు బాగానే వ‌ర్క‌వుట‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఆ క్ర‌మంలోనే నాగ్ తెలివైన గేమ్‌ప్లాన్‌ని అనుస‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం నానితో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేస్తుండ‌గానే, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌తో మ‌ల్టీస్టార‌ర్‌కి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశారు. క‌ళ్యాణ్‌రామ్ స్వ‌యంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఆగ‌ష్టు నుంచి సెట్స్‌పైకి వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక సీనియ‌ర్ ర‌చ‌యిత కం ద‌ర్శ‌కుడు గుణ్ణం గంగ‌రాజు స్క్రీన్‌ప్లే అందిస్తుండ‌గా, ప్రేమ ఇష్క్ కాద‌ల్‌, సావిత్రి చిత్రాల ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్నారు.

User Comments