నాగార్జున డైరెక్టర్ విక్రమ్ ని లాక్ చేసాడు

విక్ర‌మ్ కే కుమార్.. ద‌క్షిణాదిన ఉన్న మోస్ట్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుల్లో ఈయ‌న కూడా ఒక‌రు. కానీ ఇష్క్ సినిమాకు ముందు ఈయ‌న కూడా ఒక్క ఆఫ‌ర్ అంటూ స్టార్స్ చుట్టూ తిరిగాడు. కానీ ఇండ‌స్ట్రీలో సుడి మారిపోవ‌డానికి ఒక్క సినిమా చాలంటారు క‌దా.. 13బితో తానేంటో చూపించిన విక్ర‌మ్.. ఇష్క్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి హలో చెప్పాడు. ఇష్టం సినిమాతోనే ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా అది ఫ్లాప్ అవ్వ‌డంతో ప‌దేళ్ల పాటు ఎవ‌రికీ క‌నిపించ‌లేదు ఈ ద‌ర్శ‌కుడు. ఇష్క్ త‌ర్వాత మ‌నంతో ఈయ‌న రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. త‌మ ఫ్యామిలీకి మ‌నం లాంటి సినిమా ఇచ్చాడ‌ని.. ఏఎన్నార్ కు అంత ఘ‌న‌మైన నివాళి ఇచ్చాడ‌ని.. ఇప్ప‌టికీ విక్ర‌మ్ ను దేవుడిలా చూస్తున్నాడు నాగ్.

మ‌నం సినిమాతో విక్ర‌మ్ అంటే ఏంటో ఇప్ప‌టికే సౌత్ ఇండ‌స్ట్రీ మొత్తానికి తెలిసింది. ఆ త‌ర్వాత 24తో మ‌రోసారి త‌నలోని స‌త్తాను చూపించాడు విక్ర‌మ్ కే కుమార్. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ ద‌ర్శ‌కుడిగా ఈయ‌న విజ‌యం సాధించాడు. కాంప్లికేటెడ్ క‌థ‌ల్ని కామ‌న్ పీపుల్ కు అర్థ‌మ‌య్యే స్క్రీన్ ప్లేతో విక్ర‌మ్ వండ‌ర్స్ చేస్తున్నాడు. ద‌ర్శ‌కుడిగా ఏదో ఓ అల్లాట‌ప్పా సినిమాలు కాకుండా ఇండియ‌న్ సినిమా రేంజ్ ను పెంచే విధంగా విక్ర‌మ్ సినిమాలు ముందుకు వెళ్తున్నాయి. మ‌నం తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టికీ నిలిచిపోయే ఓ క్లాసిక్. 24 కూడా ఇండియ‌న్ స్క్రీన్ పై ఇది వ‌ర‌కు చూడ‌న‌టువంటి ఓ అద్భ‌తుమైన సైన్స్ ఫిక్ష‌న్.

ఇప్పుడు హ‌లో కూడా ప్రేమ‌క‌థ‌కే త‌న టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే జోడించాడు విక్ర‌మ్ కుమార్. ఈ చిత్ర విజ‌యంపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అఖిల్. ఇక నాగ్ అయితే హ‌లోను చూసా.. రాసి పెట్టుకోండి బ్లాక్ బ‌స్ట‌ర్ కొడుతున్నాం అనేసాడు. విక్ర‌మ్ స‌త్తా తెలిసింది కాబ‌ట్టే అక్కినేని గేట్ దాట‌నివ్వ‌డం లేదు ఈ ద‌ర్శ‌కున్ని నాగార్జున‌. ఈయ‌న త‌ర్వాతి సినిమా కూడా నాగచైత‌న్య‌తోనే ఉండ‌బోతుంద‌ని హ‌లో ఆడియో వేడుక‌లో ఫ్యాన్స్ స‌మ‌క్షంలో ఇరికించేసాడు. ఈ లెక్క‌న మ‌రో రెండేళ్ల పాటు అక్కినేని కంపౌండ్ లోనే విక్ర‌మ్ కే కుమార్ లాక్ అయిపోయిన‌ట్లే.