జాత‌కాలు చూస్తున్న నాగార్జున‌..

Last Updated on by

ఈ ఫోటో చూసిన త‌ర్వాత ఎవ‌రైనా ఇదే అనుకుంటారు క‌దా..! నాగార్జునకు చూపించినా కూడా తాను ఇదే అనుకుంటాడేమో..? అంత ప‌ర్ ఫెక్ట్ గా సూట్ అయింది ఈ ఫోటో. ఇది వ‌ర్మ సినిమా షూటింగ్ లొకేష‌న్ లో తీసిన ఫోటో. అమ్మాయిల‌కు నాగార్జున అంటే ఎంత పిచ్చో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న 60కి చేరువైనా కూడా ఇప్ప‌టికీ మ‌న్మథుడే. ఆయ‌నంటే అమ్మాయిల‌కు అంత పిచ్చి. ఇప్పుడు వ‌ర్మ సినిమా షూటింగ్ టైమ్ లో ఖాళీగా ఉన్న‌పుడు ఇలా అమ్మాయిల‌తో ఆడుకుంటున్నాడు నాగార్జున‌. అన్న‌ట్లు ఈ చిత్ర షూటింగ్ అనుకున్న‌ట్లుగానే వేగంగా జ‌రుగుతుంది.

Nagarjuna Looking Palm Reading at NagRgv4 Shooting Location Working stills

మొన్న‌టి వ‌ర‌కు బ్రేక్ లో ఉన్నా.. ఇప్పుడు ముంబైలో రెండో షెడ్యూల్ మొదలు పెట్టాడు వ‌ర్మ‌. దీనికి సంబంధించిన స్టిల్స్ కొన్ని బ‌య‌టికి వ‌చ్చాయి. నాగార్జున అందులో చాలా సీరియస్ గా గ‌న్ ప‌ట్టుకుని ర‌చ్చ చేస్తున్నాడు. మార్చ్ 10 వ‌ర‌కు ముంబైలోనే ఈ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ లో మ‌రో షెడ్యూల్ బాకీ ఉంది. అది పూర్తైతే సినిమా షూటింగ్ పూర్తైపోయిన‌ట్లే. ఏప్రిల్ లో సినిమా విడుద‌లని ముందు చెప్పాడు కానీ ఇప్పుడు మ‌రోసారి విడుద‌ల తేదీ మార్చేసాడు వ‌ర్మ‌. త్వ‌ర‌లోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తానంటూ ట్వీట్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. మొత్తానికి ఇటు జాత‌కాలు.. అటు షూటింగ్ లు అన్నీ ఒకేసారి కానిచ్చేస్తున్నాడు మ‌న్మ‌థుడు.

User Comments