నాగార్జున మిస్ అయ్యాడంట‌..!

Last Updated on by

నాగార్జున ఇప్పుడు తెలుగు హీరో కాదు.. ఈయ‌న బాలీవుడ్ వెళ్లాడు. అక్క‌డ సినిమాలు కూడా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న బ్ర‌హ్మాస్త్ర‌లో కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌ణ్ బీర్ క‌పూర్, అలియాభ‌ట్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అమ‌తాబ్ బ‌చ్చ‌న్ కూడా ఉన్నాడు. ఏ జ‌వానీ హై దివానీ ఫేమ్ అయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో నాగార్జున కూడా న‌టిస్తున్నాడు. తాజాగా షూటింగ్ కూడా మొద‌లైంది. ర‌ణ్ బీర్ క‌పూర్, అలియాభ‌ట్ తో పాటు నాగార్జున కూడా ఈ షెడ్యూల్ లో ఉన్నాడు.

తాజాగా టీం అంతా క‌లిసి లంచ్ కూడా చేసారు. ఇదే విష‌యాన్ని ట్వీట్ చేసాడు నాగార్జున‌. అయితే తాము క‌ర‌ణ్ జోహార్ ను మిస్ అయిన‌ట్లు చెప్పాడు నాగ్. అద్భుత‌మైన లంచ్ చేసాం కానీ క‌ర‌ణ్ నిన్ను మిస్ అయ్యామంటూ ట్వీటేసాడు నాగార్జున‌. ఇందులో అమ‌ల కూడా నాగార్జున‌తోనే ఉండ‌టం విశేషం. మొత్తానికి అంత‌మంది ఉన్న క‌ర‌ణ్ జోహార్ ను మాత్ర‌మే నాగార్జున భ‌లే మిస్ అయ్యాడు. 15 ఏళ్ల త‌ర్వాత ఈయ‌న న‌టిస్తోన్న హిందీ సినిమా ఇది. చివ‌ర‌గా 2003లో ఎల్ఓసీ కార్గిల్ లో న‌టించాడు నాగార్జున‌.

User Comments