ప‌వ‌న్ సినిమాలో నాగార్జున‌..!

Last Updated on by

అదేంటి.. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు మానేసాడు క‌దా..! మానేయ‌క‌పోయినా ప్ర‌స్తుతానికి బ్రేక్ ఇచ్చాడు క‌దా.. ఇప్పుడు మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాలో నాగార్జున ఏంటి అనుకుంటున్నారా..? అవును.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నాడు. ఆయ‌న ఇప్పుడు సినిమాలు చేస్తాడో చేయ‌డో కూడా తెలియ‌దు. అయితే ఇక్క‌డ మ‌నం మాట్లాడుకుంటున్నది మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి కాదు.. ప‌వ‌న్ సాధినేని గురించి. ప్రేమ ఇష్క్ కాద‌ల్.. సావిత్రి లాంటి సినిమాలు తెర‌కెక్కించిన ప‌వ‌న్ ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ క‌థ‌కు ఈయ‌న ఒకే చెప్పాడు కూడా. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ తో పాటు హ‌రికృష్ణ కూడా న‌టించ‌బోతున్నాడు.

అన్నీ క‌లిసొస్తే ఎన్టీఆర్ కూడా గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇస్తాడ‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇదే సినిమాలో నాగార్జున ముఖ్య పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుందిప్పుడు. హ‌రికృష్ణ.. నాగార్జున గ‌తంలో సీతారామ‌రాజు సినిమాలో క‌లిసి న‌టించారు. అది సూప‌ర్ హిట్. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు హ‌రికృష్ణ‌, నాగార్జున ఒకే సినిమాలో న‌టించే ఛాన్స్ దొరికింది. మ‌రి ఈ చిత్రానికి నాగార్జున ఓకే చెప్పాడో లేదో..? క‌థ న‌చ్చితే ఎవ‌రితో న‌టించ‌డానికైనా సిద్ధంగానే ఉంటాడు నాగ్. అలాంటిది న‌చ్చే క‌థ తెస్తే ప‌వ‌న్ సినిమాలో కూడా ఖచ్చితంగా న‌టిస్తాడు నాగార్జున‌. మ‌రి.. ఈ నంద‌మూరి-అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ ఎలా ఉండ‌బోతుందో..?

User Comments