నాగార్జున అంటే ఆమె నో చెప్పదు

Last Updated on by

తెలుగులో మ‌ల్టీస్టార‌ర్స్ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొద‌లైంది. ఇప్పుడు నాగార్జున‌-నాని సినిమా కూడా ముహూర్తం పెట్టుకుంది. అశ్వినీద‌త్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చ్ లో మొద‌లు కానుంది. ఈ చిత్రంలో నాగార్జున-నాని క్యారెక్ట‌ర్స్ చాలా ఫ‌న్నీగా ఉంటాయ‌ని తెలుస్తుంది. సినిమా అంతా న‌వ్వులు పంచేలా ఉంటుందని.. ఈ క‌థ విన్న వెంట‌నే అందుకే ఓకే చేసాన‌ని చెప్పాడు నాగార్జున‌. ఇక నాని కూడా త‌న‌కు ఉన్న అనుమానాల‌న్నీ నివృత్తి చేసుకుని శ్రీ‌రామ్ సినిమాకు ఓకే చెప్పాడు. ఈ చిత్రంలో నాగ్ డాన్. నాని డాక్ట‌ర్ గా న‌టిస్తార‌ని తెలుస్తుంది.

ఇప్ప‌టికే టెక్నిక‌ల్ టీం ఫైనల్ కావ‌డంతో ఇక ఇప్పుడు ఇందులో హీరోల‌తో ఎవరు రొమాన్స్ చేయబోతున్నారనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. నానికి జోడీ ఎవ‌రు.. నాగార్జున‌తో రొమాన్స్ చేసేది ఎవ‌రో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం నాగార్జున‌తో మ‌రోసారి అనుష్క న‌టించ‌బోతుంద‌ని.. నానితో మాత్రం కొత్త‌మ్మాయి మాళ‌విక శ‌ర్మ న‌టిస్తుంద‌ని తెలుస్తుంది. ఈమె ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో క‌ళ్యాణ్ కృష్ణ సినిమాలో న‌టిస్తుంది. ఇప్పుడు నాని ప‌క్క‌న ఛాన్స్ వ‌చ్చింది ఈ భామ‌కు. ఇక అనుష్క‌తో నాగ్ రొమాన్స్ అనేది పెద్ద‌గా ఆశ్చ‌ర్యం ఏం కాదు. ఎందుకంటే నాగార్జునతో నటించడానికి అనుష్క ఎప్పుడు రెడీ గానే ఉంటుంది.. మొత్తానికి మ‌రి.. ఈ జోడీల రొమాన్స్.. నాగ్-నానిల కామెడీ ఎలా ఉండ‌బోతుందో..?

User Comments