నాని-నాగార్జున టైటిల్ అదే..

Last Updated on by

నాని-నాగార్జున సినిమా టైటిల్ క‌న్ఫ‌ర్మ్ అయింది. బ‌య‌టికి చెప్ప‌క‌పోయినా ఇప్ప‌టికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా సిద్ధ‌మైపోతుంది. ఈ మ‌ల్టీస్టార‌ర్ ను శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా స‌గానికి పైగా పూర్త‌యింది. దీనికి చాలా టైటిల్స్ అనుకున్నా చివ‌రికి దేవ్ దాస్ టైటిల్ ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తుంది. తొలి రెండు సినిమాల‌కు కూడా అంద‌మైన తెలుగు టైటిల్స్ పెట్టాడు శ్రీ‌రామ్. భ‌లే మంచి రోజు.. శమంత‌క‌మ‌ణి త‌ర్వాత ఈయ‌న చేస్తోన్న మూడో సినిమా ఇది. ఈ దేవ్ దాస్ టైటిల్ ను కాస్త గ‌మ‌నిస్తే.. ఇందులో రెండు పేర్లు ఉన్నాయి.

దేవ్ అండ్ దాస్. డాక్ట‌ర్ దేవ్ గా నాని.. డాన్ దాస్ గా నాగార్జున ఇందులో న‌టిస్తున్నారు. ర‌ష్మిక‌.. ఆకాంక్ష సింగ్ హీరోయిన్లు. అశ్వినీద‌త్ ఈ చిత్రానికి నిర్మాత‌. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ న్యూయార్క్ లో విడుద‌ల చేయ‌నున్నారు. అది కూడా నాగ్ అశ్విన్ చేతుల మీదుగా దేవ్ దాస్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంది. కృష్ణార్జున యుద్ధంతో నాని.. ఆఫీస‌ర్ తో నాగార్జున‌.. శమంత‌క‌మ‌ణితో శ్రీ‌రామ్ ఆదిత్య ఫ్లాపులు ఇచ్చారు. ఈ ముగ్గురి కెరీర్స్ కు ఇప్పుడు హిట్ అవ‌స‌రం.

User Comments