పాపం… నైజాంలో నాగార్జున క‌ష్టాలు

Last Updated on by

మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ‌టం అంటే ఏంటో తెలుసా..? ఏముంది నాగార్జున‌ను చూస్తే అర్థ‌మైపోతుంది. లేక‌పోతే మ‌రేంటి..? అస‌లే ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరో ఇప్పుడు లేనిపోని రిస్కులు తీసుకున్నాడు. వ‌ర్మతో ఆఫీస‌ర్ సినిమా చేసాడు. ఈ సినిమా చేస్తున్న‌పుడే అంతా నాగార్జున‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఆఫీస‌ర్ తో నాగ్ కు తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని. అనుకున్న‌ట్లే ఈ చిత్రం పూర్తైన త‌ర్వాత కూడా నాగ్ కు తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. షూటింగ్ కు ముందే తెలుగు ఇండ‌స్ట్రీతో వ‌ర్మ పెట్టుకున్న సున్నంతో సినిమాపై నెగిటివ్ ప‌బ్లిసిటీ పెరిగిపోయింది. దానికితోడు ఇప్పుడు విడుద‌లకు ఇంకా ప‌ది రోజుల స‌మ‌య‌మే ఉంది.. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా సినిమా బిజినెస్ కాలేదు.

ముఖ్యంగా తెలుగు సినిమాకు ఆయువుప‌ట్టుగా చెప్పుకునే నైజాంలో ఆఫీస‌ర్ ను ఎవ‌రూ కొన‌లేదు. దాంతో వ‌ర్మే స్వ‌యంగా కంపెనీ ప్రొడ‌క్ష‌న్స్ లో సినిమాను సొంతంగా విడుద‌ల చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ముందు దిల్ రాజుకు అప్ప‌గించాల‌ని చూసినా కూడా ఆయ‌న త‌ప్పుకున్నారు. దాంతో చేసేదేం లేక ఇప్పుడు సొంతంగా వ‌ర్మే విడుద‌ల చేస్తున్నాడు. ఇందులో నాగార్జున సాయం కూడా ఉంది. జూన్ 1న విడుద‌ల కానుంది ఆఫీస‌ర్. మొత్తానికి.. నైజాంలో నాగ్ క‌ష్టాలు ఎలా ఉండ‌బోతున్నాయో..?

User Comments