ఆఫీసర్ కి మంచి గిరాకీ వస్తుంది

Last Updated on by

వ‌ర్మ మామూలోడు కాదు.. ఐస్ క్రీమ్ లాంటి సినిమా తీసి అందులోనే లాభాలు చూసిన ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. అలాంటి ద‌ర్శ‌కుడి చేతికి నాగార్జున దొరికితే ఊరుకుంటాడా..? ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత ఫ‌లితం ఏదైనా ఉండ‌నీ.. నిర్మాత మాత్రం మామూలు లాభాల్లో లేడు. భారీ సినిమాల‌కు కూడా సాధ్యం కాని రీతిలో ఈ సినిమా బిజినెస్ చేస్తున్నాడు వ‌ర్మ‌. అది కేవ‌లం వ‌ర్మ బుర్ర‌కు మాత్ర‌మే సాధ్యం. ఈయ‌న సినిమాల్లో ఫారెన్ సాంగులు ఉండ‌వు.. అదిరిపోయే భారీ యాక్ష‌న్ సీక్వెన్సులు ఉండ‌వు.. అన్నీ ఉన్న‌చోటే ప‌క్కా లెక్క‌ల‌తో పూర్తి చేస్తాడు వ‌ర్మ‌. అందుకే ఈయ‌న సినిమాల బ‌డ్జెట్ ఎప్పుడూ హ‌ద్దులు దాట‌దు. ఇప్పుడు నాగ్ సినిమాకు కూడా ఇదే చేస్తున్నాడు. ఈ చిత్ర డిజిట‌ల్ రైట్స్.. శాటిలైట్ రైట్స్.. అన్నీ క‌లిపి ఇప్ప‌టికే భారీ రేట్ కు అమ్మేసాడు.

ఆఫీస‌ర్ థియెట్రిక‌ల్ రైట్స్ ను సుబ్బారెడ్డి త‌న ఎస్ సినీ క్రియేష‌న్స్ పై విడుద‌ల చేయ‌బోతున్నాడు. దీనికోసం ఏకంగా 15.5 కోట్లు నిర్మాత‌ల‌కు ఇవ్వ‌బోతున్నారు. ఇప్ప‌టికే రైట్స్ రూపంలోనే బ‌డ్జెట్ పోను 5 కోట్లు లాభం అందుకున్నాడు వ‌ర్మ‌. ఇప్పుడు ఈ 15 కోట్లు కూడా చేర్చితే.. ఆ లాభం 20 కోట్ల‌కు చేరింది. అమేజాన్ దీనికి 8 కోట్ల బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. ఇలా ఇవ్వ‌డానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. విడుద‌లైన మూడు వారాల్లోనే ఒరిజిన‌ల్ ను అప్ లోడ్ చేయాల‌ని కండీష‌న్ పెట్టారు. దానికి వ‌ర్మ కూడా ఓకే అన‌డంతో డీల్ తెగింది. మ‌రోవైపు థియెట్రిక‌ల్ రైట్స్ కూడా భారీగానే అమ్మేసారు. హిందీలోనూ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు కాబ‌ట్టి నాగార్జున ఇమేజ్ కు 15 కోట్లు పెద్ద లెక్క కాదు. సినిమా బాగుంటే ఈజీగా వ‌చ్చేస్తాయి. మే 25న ఆఫీస‌ర్ విడుద‌ల కానుంది.

User Comments