నా కోడ‌లు బంగారం అంటోన్న నాగ్..

అక్కినేని వారింట ఇప్పుడు పెళ్లి క‌ళ క‌నిపిస్తుంది. నాగ‌చైత‌న్య పెళ్లై వారం గ‌డుస్తున్నా కూడా ఇప్ప‌టికీ అదే ఆనందంలో మునిగిపోతున్నారు అక్కినేని కుటుంబ స‌భ్యులు. తాజాగా రాజుగారిగ‌ది 2 ప్ర‌మోష‌న్ కోసం కోడ‌లితో క‌లిసి మీడియా ముందుకు వ‌చ్చాడు నాగార్జున‌. సినిమా విష‌యాల‌తో పాటు కోడ‌లి గురించి కూడా చాలా విష‌యాలు చెప్పాడు ఈ మ‌న్మ‌థుడు. ముఖ్యంగా సినిమాలో స‌మంత న‌ట‌న చూసి తానే షాక్ అయ్యానంటున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. మ‌రీ ముఖ్యంగా క్లైమాక్స్ లో త‌న కోడ‌లి న‌ట విశ్వ‌రూపం చూస్తారంటున్నాడు నాగార్జున‌. స‌మంత ఆ స్థాయిలో న‌టిస్తుంద‌ని తాను కూడా ఊహించ‌లేద‌న్నాడు ఈ హీరో.

సినిమాలో స‌మంత ఉండేది కాసేపే అయినా కూడా ఈ సినిమానే త‌న‌పై న‌డుస్తుంద‌ని చెప్పాడు నాగార్జున‌. ఇక ప‌ర్స‌న‌ల్ గా చూసుకుంటే ఈ చిత్రం విజ‌యం సాధించాల‌ని తాను గ‌ట్టిగా కోరుకుంటున్న‌ట్లు చెప్పాడు నాగార్జున‌. కోడ‌లు పెళ్లితో పాటే విజ‌యాన్ని కూడా తీసుకొచ్చింద‌ని జీవితాంతం గుర్తుండిపోయేలా రాజుగారిగ‌ది 2 ఉంటుంద‌ని న‌మ్ముతున్నట్లు చెప్పాడు నాగార్జున‌. మొత్తానికి నా కోడ‌లు బంగారం అంటున్నాడు ఈ మ‌న్మ‌థుడు.