ట్రెండీ టాక్‌: సీక్వెల్ కింగ్

Last Updated on by

2018 కింగ్ కెరీర్ కి ఏమంత క‌లిసి రాలేదు. అక్కినేని కాంపౌండ్ కి మిశ్ర‌మ ఫ‌లితాలు త‌ప్ప‌లేదు. నాగ్ న‌టించిన‌ దేవ‌దాసు బావుంద‌ని టాక్ వ‌చ్చినా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. అందుకే క‌నీసం 2019 అయినా క‌లిసొస్తుందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆ క్ర‌మంలోనే నాగార్జున ప‌లు క్రేజీ సీక్వెల్స్ కి తెర‌తీయ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

వీటిలో మ‌న్మ‌ధుడు సీక్వెల్, సోగ్గాడే చిన్ని నాయ‌న సీక్వెల్ (బంగార్రాజు) రెండూ ఉన్నాయి. ఓవైపు `మ‌న్మ‌ధుడు 2` కోసం క‌స‌ర‌త్తు చేస్తూనే, మ‌రోవైపు బంగార్రాజు కోసం క‌స‌ర‌త్తులో వేగం పెంచాడు. ఇవి రెండూ కొద్ది వారాల గ్యాప్ లోనే ప్రారంభం కానున్నాయ‌ని తెలుస్తోంది. అలాగే ఈ రెండు సినిమాల్ని ప్ర‌తిష్ఠాత్మ‌క అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌లోనే నాగార్జున స్వ‌యంగా నిర్మించ‌నున్నారు. మ‌న్మ‌ధుడు 2 క‌థ‌ను రెడీ చేసుకుని డైరెక్ట్ చేసేందుకు రాహుల్ ర‌వీంద్ర‌న్ సిద్ధంగా ఉన్నాడు. ఇక సోగ్గాడే ఫేం క‌ళ్యాణ్ కృష్ణ గ‌త ఏడాదిన్న‌ర కాలంగా బంగార్రాజు స్క్రిప్టుపైనే సీరియ‌స్ గా క‌స‌ర‌త్తు చేశాడు. ప్ర‌స్తుతం కొత్త సినిమాని ప్రారంభించేందుకు అత‌డు పూర్తిగా రెడీ అవుతున్నాడు. మొత్తానికి కింగ్ సీక్వెల్ కింగ్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు.

User Comments