నాగశౌర్య‌లో రైట‌ర్ ఉన్నాడా

Naga Shaurya's next has a crazy title

యంగ్ హీరో నాగ‌శౌర్య ఛ‌లో స‌క్సెస్ తో మ‌ళ్లీ లైమ్ లైట్ లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టివ‌ర‌కూ వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఉన్న నాగ‌శౌర్య సొంతంగా ఐరా క్రియేష‌న్స్ అనే బ్యార్ స్థాపించి కొత్త ద‌ర్శ‌కుడు వేణు కుడుములతో చేసి స‌క్సెస్ అందుకున్నాడు. సినిమా అనూహ్యాంగా ఊహించ‌ని విజ‌యాన్ని న‌మోదు చేసింది. మ‌రి అంత పెద్ద స‌క్సెస్ వెనుక అస‌లు కార‌కుడు ఎవ‌రు? అంటే నాగ‌శౌర్య అనే తెలుస్తోంది. అంతేకాదు ఆయ‌న‌లో మంచి రైట‌ర్ కూడా ఉన్నాడ‌న్న విష‌యాన్ని ఆల‌స్యంగా రివీల్ చేసాడు. ఛ‌లోకి క‌థ అందించింది నాగ‌శౌర్య అట‌.

కానీ టైటిల్ కార్డ్స్ లో పేరు వేసుకోలేద‌న్నాడు. ప్ర‌స్తుతం న‌టిస్తోన్న అశ్వ‌త్థామ చేస్తున్నాంకు తానే ర క‌థ అందిస్తున్నాడుట‌. అశ్వ‌త్థామ రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి అన్నాడు. అశ్వ‌త్థామ‌ కు మాత్రం రైట‌ర్ గా టైటిల్ కార్స్డ్ లో పేరు ప‌డుతుంద‌న్నాడు. మొత్తానికి నాగ‌శౌర్య అంద‌మైన హీరోనే కాదు..త‌న లో రైట‌ర్ కూడా ఉన్నాడ‌ని చాటి చెబుతున్నాడు. అలాగే ఫ‌లానా అబ్బాయి.. ఫ‌లానా అమ్మాయి అనే సినిమా కూడా చేస్తున్నాడుట‌. ఇందులో ఏడు డిఫ‌రెంట్ పాత్ర‌లు చేస్తున్నాడుట‌. అన్ని వైవిథ్యంగా గా ఉంటాయ‌ని తెలిపాడు.

Also Read : Naga Shaurya’s Falana Abbayi Falana Ammayi