షాకింగ్.. డ్రగ్స్ కేసులో పూరీ, రవితేజ, ఛార్మి…,

Names Tollywood Celebrities DRUGS Rocket Revealed
టాలీవుడ్ మొత్తానికి షాక్ తగిలింది. ఆ మాటకొస్తే టాలీవుడ్ కు ఎలా ఉన్నా దానిని అభిమానిస్తూ వస్తోన్న తెలుగు సినీ లవర్స్ కు దిమ్మతిరిగేలా చేశారు. డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ మునిగితేలుతోందని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఏకంగా డ్రగ్స్ తో సంబంధాలు కలిగి ఉన్న లిస్టే బయటకు వచ్చేసింది. ఈ లిస్టు ఇప్పటికే సినీ పెద్దల దగ్గరకు వచ్చేసినా కూడా బయట పెట్టకుండా వార్నింగ్ తో సరిపెట్టేసిన విషయం తెలిసే ఉంటుంది. కానీ ఎక్సయిజ్ శాఖ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్ ను విచారించి, అతడి కాల్ డేటా, వాట్సాప్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి.. అతడితో సంబంధమున్న అందరికీ నోటీసులు పంపారని సమాచారం.
ఈ క్రమంలో ఇప్పటివరకు 19 మందికి నోటీసులు పంపగా.. అందులో ఇప్పుడు 12 మంది సెలబ్రిటీల పేర్లను ఎక్సయిజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ బయటపెట్టడం కలకలం రేపుతోంది. అందులోనూ ఆ లిస్టులో టాప్ సెలబ్రిటీలు ఉండటం.. వీరిని ఈ నెల 19 నుంచి 27 వరకు ప్రశ్నించబోతున్నామని అధికారులు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ లిస్టును ఓసారి పరిశీలిస్తే సినిమాలను, సినిమా వాళ్ళను ప్రేమించేవాళ్లకు షాక్ తగలడం ఖాయం. ముఖ్యంగా హీరో, డైరెక్టర్, హీరోయిన్, నిర్మాత అనే తేడా లేకుండా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు మొదలైన వాటితో సంబంధం కలిగి ఉన్నారని అధికారులు స్వయంగా చెప్పడంతో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇదిలా ఉంటే, డ్రగ్స్ రాకెట్ లో కీలకమైన కెల్విన్ నాలుగేళ్ళ క్రితమే సినీ పరిశ్రమపై కన్నేసినట్లు అధికారుల విచారణలో తేలడం గమనార్హం. మరి ఇప్పుడైతే ఓసారి అధికారులు రిలీజ్ చేసిన ఆ సెలబ్రటీల లిస్టు చూస్తే..
హీరోలు – రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు
డైరెక్టర్ – పూరీ జగన్నాథ్
హీరోయిన్స్ – ఛార్మి, ముమైత్ ఖాన్
కెమెరామెన్ – శ్యామ్ కె నాయుడు
ఆర్ట్ డైరెక్టర్ – చిన్నా
రవితేజ డ్రైవర్ – శ్రీనివాసరావు
                  ప్రస్తుతానికి ఈ 12 మంది పేర్లే బయటకు రావడంతో సినీ సర్కిల్ లో ప్రస్తుతం ఇదే సంచలన న్యూస్ అవుతుంది. ఇకపోతే, వీరందరికీ ఇప్పటికే నోటీసులు పంపడం, ఓ వారం పాటు అందరినీ వ్యక్తిగతంగా కార్యాలయానికి పిలిచి ప్రశ్నించబోతున్నట్లు తెలియడం నిజంగా షాకింగ్ విషయమనే అనాలి. మరి ఇది ఇక్కడితో ఆగుతుందా లేక ఇంకా ముందుకెళ్ళి మరింత షాక్ లు ఇస్తుందా అనేది చూడాలి.