పిక్‌టాక్‌: ప‌రికిణీలో న‌మ్ర‌తా మ‌హేష్‌

Last Updated on by

ప‌రికిణీలో ప‌ల్లెటూరు పావ‌డాలా క‌నిపిస్తోందే అని అన‌కండి! ఎందుకంటే అక్క‌డ ప‌రికిణీలో క‌నిపిస్తున్న‌ది ఒక సూప‌ర్‌స్టార్ భార్యామ‌ణి. ఇండియాలోనే ది గ్రేట్‌ సూప‌ర్‌స్టార్‌ని త‌యారు చేసిన గ్రేట్ కెరీర్ డిజైన‌ర్ కం హోమ్ మేక‌ర్‌. అంతేనా భ‌విష్య‌త్ సూప‌ర్‌స్టార్ల‌ను త‌యారు చేయ‌బోతున్న మేటి గృహిణి. ఇన్ని విల‌క్ష‌ణాలు ఉన్న ఆ మ‌హిళ ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. షి ఈజ్ న‌న్ అద‌ర్ దేన్ న‌మ్ర‌తా మ‌హేష్‌.

ప‌ల్లె ప‌ట్టు పావ‌డాలా సింపుల్‌గా క‌నిపిస్తున్నా, జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పే నైపుణ్యం ఉన్న మేటి ప్ర‌తిభావ‌ని న‌మ్ర‌త‌. ఇంటెలిజెంట్ విమెన్‌. ఫేజ్ 3 ప్ర‌పంచంలో చుర‌క‌త్తి. సినిమా బిజినెస్‌లో ఆనుపానులు తెలిసి సొంత బ్యాన‌ర్‌నే ర‌న్ చేసేంత చాణ‌క్యం తెలిసిన ది గ్రేట్ న‌మ్ర‌త శిరోద్క‌ర్ ఇలా కొత్త రూపంలో క‌నిపించి షాకిచ్చారేంటి? అంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ కొత్త రూపం ఎప్ప‌టిది? ఎక్క‌డిది? అంటే … ఇటీవ‌లే త‌న ఫ్రెండు దియా భూపాల్ సోద‌రి శ్రీయా భూపాల్ పెళ్లి వేడుక‌లో న‌మ్ర‌త ఇలా ద‌ర్శ‌న‌మిచ్చారు. ఆ వేడుక‌లో ఒకానొక సంద‌ర్భంలో అన్న‌మాట‌!

User Comments