నంద‌మూరి కాంపౌండ్ లొల్లేంటో?

Last Updated on by

న‌ట‌సింహా నంద‌మూరి కాంపౌండ్‌కి, ఎన్టీఆర్ కాంపౌండ్‌కి విభేధాలు ఉన్నాయ‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైన సంగ‌తి తెలిసిందే. తార‌క్‌, క‌ళ్యాణ్‌రామ్ బాబాయ్ బాల‌య్య ముందు ఎంత‌గా ఒదిగి ఉన్నా.. ఆ ఇరు కాంపౌండ్‌ల మ‌ధ్య విభేధాలు అంతే తేలిగ్గా స‌మ‌సిపోవ‌న్న‌ది వాస్త‌వం. అయితే అస‌లు బాబాయ్‌- అబ్బాయ్ మ‌ధ్య నిజంగానే విభేధాలున్నాయా? బాబాయ్ బాల‌కృష్ణ త‌న‌యులు ఎన్టీఆర్‌, క‌ల్యాణ్‌రామ్‌ల‌ను ద‌రికి చేర‌నివ్వ‌రా? అంటే దీనికి స‌రైన ఆన్స‌ర్ చెప్ప‌డం క‌ష్ట‌మే.

ఇక‌పోతే .. అస‌లు వాస్త‌వికంగా బాల‌య్య‌కు బిడ్డ‌ల‌పై కోపం ఉన్నా లేక‌పోయినా .. ఆ కుటుంబంలో క‌ల‌త‌ల‌కు కొంద‌రు కుట్ర ప‌న్నుతున్నార‌న్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఇక ఎన్టీఆర్‌పై ఉన్న‌వీ, లేనివీ నూరి పోస్తూ కుట్ర‌లు ప‌న్నే గ్యాంగ్‌ల‌కు కొద‌వేం లేదు. బాల‌య్య కాంపౌండ్‌లో ప్ర‌చార‌విభాగంలో ఉన్న కొంద‌రు ఎన్టీఆర్‌పై ఓ రేంజులో వ్య‌తిరేక‌త నూరిపోయ‌డం ప‌లు సంద‌ర్భాల్లో విస్త్ర‌తంగా చ‌ర్చ‌కొచ్చింది. అంటే అస‌లు కంటే కొస‌రు ఓవ‌రాక్ష‌న్ ఆ కుటుంబానికి మ‌రింత చేటు తెస్తోంద‌న్న సంగ‌తిని నంద‌మూరి అభిమానులు గుర్తెర‌గాలి. ఇక‌పోతే ఇటీవ‌లి కాలంలో మెగా హీరోలంతా ఒకే వేదిక‌ల‌పై క‌నిపిస్తూ మేం అంతా ఒక‌టే అని చాటి చెబుతున్న వేళ‌.. ఇప్పుడు నంద‌మూరి హీరోలంతా ఏకం కావాల్సిన స‌న్నివేశం క‌నిపిస్తోంది. అయితే అందుకు బాల‌య్య‌- ఎన్టీఆర్‌- క‌ల్యాణ్ రామ్ చేతులు క‌లుపుతారా? క‌ల‌ప‌రా? క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం! అంటారా.. అన‌రా? అన్న‌ది వేచి చూడాలి

User Comments