అన్న కోసం తమ్ముడు.. ఆ ఇద్దరి కోసం నాన్న

Last Updated on by

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ బాగా న‌డుస్తుంది. ముఖ్యంగా ఒకే ఫ్యామిలీ హీరోలు క‌లిసి న‌టిస్తే చూడాల‌ని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. చాలా రోజుల‌గా నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్ పై వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అది ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు అది జ‌రిగేలా ఉంది. త్వ‌ర‌లోనే నంద‌మూరి కుటుంబం నుంచి కూడా ఓ మ‌ల్టీస్టార‌ర్ వ‌చ్చేలా క‌నిపిస్తుంది. అది కూడా క‌ళ్యాణ్ రామ్ సినిమాతోనే. అవును.. క‌ళ్యాణ్ రామ్ సినిమాలో ఎన్టీఆర్, హ‌రికృష్ణ న‌టించ‌బోతున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయిప్పుడు ఇండ‌స్ట్రీలో. ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే, నా నువ్వే సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం రెండూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లోనే ఉన్నాయి.

వీటి త‌ర్వాత ప‌వ‌న్ సాధినేనితో ఓ సినిమా చేయ‌బోతున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఇది సోషియా ఫాంట‌సీ క‌థ‌. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పైనే క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ తో పాటు ఎన్టీఆర్, హ‌రికృష్ణ కూడా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించ‌నున్నార‌ని తెలుస్తుంది. ఇప్పుడు అన్న‌య్య కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాడు ఎన్టీఆర్. అలాంటిది ఓ అతిథి పాత్ర‌లో న‌టించ‌లేడా..? క‌థ న‌చ్చితే ఖచ్చితంగా అన్న కోసం త‌మ్ముడు దిగిరావ‌డం ఖాయం. ఇక తండ్రి గురించి చెప్పాల్సిందేమీ లేదు. హ‌రికృష్ణ కావాలంటే ఖచ్చితంగా న‌టిస్తాడు. దాంతో ఇప్పుడు నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్ పై ఎక్క‌డ‌లేని ఆస‌క్తి మొద‌లైంది అభిమానుల్లో.

User Comments