ఎమ్మెల్యే క‌లెక్ష‌న్స్.. కాస్త క‌ష్ట‌మే..

Last Updated on by

క‌ళ్యాణ్ రామ్ కు మ‌రో ఫ్లాప్ వ‌చ్చేలా ఉంది. ఎమ్మెల్యే జ‌ర్నీ చూస్తుంటే ఊహించినంతగా లేదు. స‌క్సెస్ మీట్ అయితే చేసారు కానీ నిజంగా స‌క్సెస్ అయ్యేంత క‌లెక్ష‌న్లు మాత్రం రావ‌ట్లేదు ఇక్క‌డ‌. సినిమా విడుద‌లై అప్పుడే నాలుగు రోజులు గ‌డిచిపోయింది. వ‌చ్చిన క‌లెక్ష‌న్లు చూస్తుంటే అంత ఆశా జ‌న‌కంగా లేవు. 4 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా 7.7 కోట్ల షేర్ వ‌సూలు చేసింది ఎమ్మెల్యే. నిజానికి క‌ళ్యాణ్ రామ్ మార్కెట్ కు ఇవి మంచి వ‌సూళ్లే కానీ ఎమ్మెల్యే సినిమా చేసిన బిజినెస్ తో పోలిస్తే మాత్రం ఇవి త‌క్కువ క‌లెక్ష‌న్లు. సినిమా సేఫ్ అవ్వాలంటే అక్ష‌రాలా 15 కోట్ల షేర్ రావాలి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చింది స‌గ‌మే. చాలా ఏరియాల్లో స‌గం కూడా వ‌సూళ్లు రాలేదు. ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే మిగిలిన వ‌సూళ్లు వ‌చ్చేలా లేవు. అది చాలా అంటే చాలా క‌ష్టంగా క‌నిపిస్తుంది. ముఖ్యంగా మ‌రో రెండు రోజుల్లో రంగ‌స్థ‌లం విడుద‌ల కానుంది. అది వ‌చ్చిందంటే ఖచ్చితంగా థియేట‌ర్ ల క్లీన్ స్వీప్ త‌ప్ప‌నిస‌రి. ఇలాంటి స‌మ‌యంలో ఎమ్మెల్యే మిగిలిన 8 కోట్లు రిక‌వ‌ర్ చేయ‌డం దాదాపు అసాధ్యం. దాంతో క‌ళ్యాణ్ రామ్ కు మ‌రోసారి నిరాశ త‌ప్పేలా లేదు. ఈ ఎమ్మెల్యే ప్ర‌యాణం చివ‌రివ‌ర‌కు ఎలా సాగ‌నుందో..? ఎక్క‌డ ముగియ‌నుందో..?

User Comments