`ఎదురీత`కు నంద‌మూరి హీరో ప్ర‌మోష‌న్‌

Last Updated on by

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 118 చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్రశంస‌లు ద‌క్కినా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. పంపిణీదారుల‌కు స్వ‌ల్పంగా న‌ష్టాలు త‌ప్ప‌లేద‌ని ట్రేడ్ లో టాక్ వినిపించింది. ఓ ర‌కంగా క‌ళ్యాణ్ రామ్ చేసిన ప్ర‌యోగం ఇది. మ‌రోసారి అదే త‌ర‌హాలో క‌ళ్యాణ్ రామ్ వేరొక ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్ట‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. క‌ళ్యాణ్ రామ్ న‌టించే త‌దుప‌రి చిత్రాల్లో ప్ర‌యోగాలు ఉంటాయ‌న్న మాటా వినిపిస్తోంది.

నంద‌మూరి హీరో ప్ర‌యోగాలు చేయ‌డ‌మే కాదు.. ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కు స‌పోర్ట్ నిస్తున్నారు. క్యారెక్ట‌ర్ న‌టుడు శ్రావ‌ణ్, లియోన‌, అర్జున్ రెడ్డి ఫేం జియా శ‌ర్మ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన ఎదురీత చిత్రానికి క‌ళ్యాణ్ రామ్ ప్ర‌మోషన్ చేస్తున్నారు. ఎదురీత ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రం. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమా 40 ఏళ్ల తండ్రికి అత‌డి కుమారుడికి మ‌ధ్య ఉన్న అనుబంధం నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగే చిత్ర‌మిది. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 1975 క్లాసిక్ సినిమా ఎదురీత‌కు క‌నెక్టివిటీ ఉంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇక అప్ప‌ట్లోనే అమానుష్ పేరుతో వ‌చ్చిన హిందీ బ్లాక్ బ‌స్ట‌ర్ కి రీమేక్ గా ఎన్టీఆర్ ఎదురీత తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. హిందీలో ఆ చిత్రాన్ని త‌మిళ తంబీలు బాల‌మురుగ‌న్ – బోగ‌రి ల‌క్ష్మి నారాయ‌ణ్ సంయుక్తంగా తెర‌కెక్కించారు.

 

User Comments