ఒకప్పటి క‌ళ్యాణ్ రామ్ కాదు

Last Updated on by

ఒక‌ప్ప‌ట్లా ఇప్పుడు లేడు క‌ళ్యాణ్ రామ్. ఖచ్చితంగా ఈయ‌న‌లో చాలా మార్పు వ‌చ్చింది. ఎందుకో తెలియ‌దు కానీ ఇప్పుడు చాలా కొత్త‌గా ఉన్నాడు ఈ ఎమ్మెల్యే. తాజాగా ఈయ‌న న‌టించిన ఎమ్మెల్యే కూడా మంచి వ‌సూళ్లు సాధిస్తుంది. దాంతో మ‌రింత జోష్ మీదున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఎప్పుడు ఓ సినిమా పూర్తైన త‌ర్వాత మ‌రో సినిమా అని ఊహ‌ల్లో ఉండే క‌ళ్యాణ్.. ఇప్పుడు మాత్రం ఒకేసారి మూడు నాలుగు సినిమాలు అంటున్నాడు. ఇది అస‌లు క‌ళ్యాణ్ రామ్ స్టైల్ కాదు. కానీ ఎమ్మెల్యే సెట్స్ పై ఉండ‌గానే జ‌యేంద్ర‌తో నా నువ్వే షూటింగ్ పూర్తి చేసాడు ఈ హీరో. త‌మ‌న్నా ఇందులో హీరోయిన్ గా న‌టించింది. మే 18న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

నా నువ్వే డ‌బ్బింగ్ కూడా మొద‌లు పెట్టేసాడు క‌ళ్యాణ్ రామ్. ఇది సెట్స్ పై ఉండ గానే రో రెండు సినిమాలు ఫైన‌ల్ చేసాడు ఈ హీరో. ఇప్ప‌టికే ప్రేమ ఇష్క్ కాద‌ల్ ఫేమ్ ప‌వ‌న్ సాధినేనితో ఓ సినిమా క‌మిట‌య్యాడు క‌ళ్యాణ్ రామ్. ఇందులో ఎన్టీఆర్, హ‌రికృష్ణ కూడా న‌టిస్తున్నార‌ని తెలుస్తుంది. ఈ మ‌ధ్యే మ‌జ్ను ఫేమ్ విరించివ‌ర్మ‌తో ఓ సినిమాకు సైన్ చేసాడు ఈ హీరో. జెమిని కిర‌ణ్ ఈ చిత్రానికి నిర్మాత‌. మొత్తానికి ఇప్పుడు నంద‌మూరి ప‌టాస్ జోరు మాత్రం మామూలుగా లేదు. ఇవ‌న్నీ హిట్ అయితే ఎన్నాళ్లుగానో క‌ళ్యాణ్ రామ్ కోరుకుంటున్న స్టార్ ఇమేజ్ వ‌చ్చేసిన‌ట్లే.

User Comments