ఇది నంద‌మూరి వారి రంగ‌స్థ‌లం

జీవితంలో ఎప్పుడూ మంచి మాత్ర‌మే జ‌రుగుతుంటే త‌ట్టుకోవ‌డం క‌ష్టం. అప్పుడ‌ప్పుడూ చెడు జ‌రుగుతుంటేనే మంచి విలువ తెలుస్తుంది. నంద‌మూరి కుటుంబంలోనూ ఇదే జ‌రిగింది. అప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ తో క‌ళ్యాణ్ రామ్ బంధం అనేది కాస్తే ఉండేది. క‌లిసే ఉన్నారు కానీ ఒక‌ర్ని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేనంత రిలేష‌న్ మాత్రం కాదు. కానీ అలాంటి టైమ్ లో హ‌రికృష్ణ పెద్ద కుమారుడు నంద‌మూరి జాన‌కిరామ్ యాక్సిడెంట్ లో క‌న్నుమూసారు. అప్ప‌టి వ‌ర‌కు క‌ళ్యాణ్ రామ్ కు అన్నీ అన్న‌య్యే. స‌డ‌న్ గా అన్న‌య్య మ‌ర‌ణం క‌ళ్యాణ్ రామ్ ను కుంగ‌దీసింది. జాన‌కిరామ్ మ‌ర‌ణం త‌ర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆ స్థానాన్ని భ‌ర్తీ చేస్తున్నాడిప్పుడు. క‌ళ్యాణ్ రామ్ కు అన్నీ త‌మ్ముడే ఇప్పుడు. మ‌రోవైపు త‌మ్ముడి కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధంగా ఉన్నాడు క‌ళ్యాణ్ రామ్. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ ఓ వైపు.. హ‌రికృష్ణ కుటుంబం మ‌రోవైపు అన్న‌ట్లు త‌యారైంది య‌వ్వారం. ఇలాంటి టైమ్ లో అన్నాద‌మ్ములిద్ద‌రూ ఒక‌రికి ఒక‌రు అన్న‌ట్లు ఉన్నారు. ప‌ర్స‌న‌ల్ గా, ప్రొఫెష‌న‌ల్ గా త‌మ్ముడికి అండ‌గా ఉన్నాడు క‌ళ్యాణ్ రామ్.
సినిమాల ప‌రంగానూ త‌మ్ముడి కెరీర్ కు త‌నే గైడ్ గా ఉన్నాడు. అన్నీ త‌న‌కు త‌మ్ముడే ప్రాణం అన్న‌ట్లుగా సిద్ధ‌మ‌య్యాడు క‌ళ్యాణ్ రామ్. ఇప్పుడు జై ల‌వ‌కుశ సినిమా కూడా త‌మ్ముడితోనే నిర్మించాడు క‌ళ్యాణ్ రామ్. ఈ మ‌ధ్యే ఆడియో వేడుక‌లో అన్న‌య్య గురించి మాట్లాడుతూ.. త‌న‌కు నాన్న త‌ర్వాత నాన్న అంటూ క‌ళ్యాణ్ గురించి మాట్లాడాడు యంగ్ టైగ‌ర్. ఈ మాట‌తో అక్క‌డి వాళ్లంతా ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయిపోయారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఎంత బ‌లంగా ఉందో చెప్ప‌డానికి ఈ ఒక్క మాట చాలేమో..? మొత్తానికి ఒక అన్న‌య్య క‌న్నుమూసి.. ఈ బ్ర‌ద‌ర్స్ బంధానికి నాందీ వేసాడు.