2014..2015..2016 నంది వ‌ర్ధ‌నాలు వీరే..

మొన్న మార్చ్ లోనే 2012, 13 సంవ‌త్స‌రాల‌కు గానూ నంది అవార్డుల‌ను ప్ర‌ధానం చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం. అవి వ‌చ్చిన ఏడాదిలో 2014..15..16 ఏళ్ల‌కు గానూ నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. ముందుగా 2016 ఏడాదిలో చాలా సినిమాలు అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఉత్త‌మ చిత్రంగా పెళ్లిచూపులు ఎంపికైంది. ఉత్త‌మ న‌టుడిగా జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో న‌ట‌న‌కు ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. న‌టిగా పెళ్లిచూపులు ఫేమ్ రితూవ‌ర్మ అవార్డ్ అందుకోనుంది. ఇక స‌హాయ న‌టుడిగా మోహ‌న్ లాల్.. న‌టిగా జ‌య‌సుధ ఎంపిక‌య్యారు. విల‌న్ గా స‌రైనోడుకు ఆది అవార్డ్ అందుకుంటున్నాడు. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా శ‌త‌మానం భ‌వ‌తి సినిమాకు స‌తీష్ వేగేశ్న నంది సొంతం చేసుకున్నాడు. ఉత్త‌మ తొలిచిత్ర ద‌ర్శ‌కుడిగా సోగ్గాడే చిన్నినాయ‌నా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన క‌ళ్యాణ్ కృష్ణ అందుకున్నాడు. ఇక ఇదే ఏడాదిలో ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా స‌మీర్ రెడ్డి.. సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంఎం కీర‌వాణి అవార్డులు సొంతం చేసుకున్నారు.

2015 ఏడాదికి కూడా ఒకేసారి అవార్డులు ప్ర‌క‌టించారు. 2015లో ఎన్ని సినిమాలు వ‌చ్చినా అవార్డులు మాత్రం బాహుబ‌లి వైపు ప‌రుగులు తీసాయి. ఉత్త‌మ చిత్రంగా బాహుబ‌లికి అవార్డ్ వెళ్లిపోయింది. ఉత్త‌మ న‌టుడిగా శ్రీ‌మంతుడు సినిమాలో న‌ట‌న‌కు మ‌హేశ్ సొంతం చేసుకున్నాడు. న‌టిగా సైజ్ జీరోలో అనుష్క ప‌డిన క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కింది. ఇక స‌హాయ న‌టుడిగా పోసాని కృష్ణ‌ముర‌ళి.. స‌హాయ న‌టిగా ర‌మ్య‌కృష్ణ‌.. విల‌న్ గా రానా ద‌గ్గుపాటి అవార్డ్ అందుకుంటున్నాడు. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా బాహుబ‌లి సినిమాకు రాజ‌మౌళి నంది సొంతం చేసుకున్నాడు. ఉత్త‌మ తొలిచిత్ర ద‌ర్శ‌కుడిగా ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ అందుకున్నాడు. ఇక ఇదే ఏడాదిలో ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా సెంథిల్ కుమార్.. సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంఎం కీర‌వాణి అవార్డులు సొంతం చేసుకున్నారు.

2014లో లెజెండ్ సినిమాకు ఎక్కువ‌గా అవార్డులు వ‌చ్చాయి. ఉత్త‌మ న‌టుడిగా బాల‌కృష్ణ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. న‌టిగా గీతాంజ‌లిలో న‌ట‌న‌కు అంజ‌లి అవార్డ్ అందుకోనుంది. ఇక స‌హాయ న‌టుడిగా మ‌నంలో న‌ట‌న‌కు అక్కినేని నాగ‌చైత‌న్య‌.. న‌టిగా చంద‌మామ క‌థ‌లు సినిమాకు ల‌క్ష్మీ మంచు ఎంపిక‌య్యారు. విల‌న్ గా లెజెండ్ లో న‌ట‌న‌కు జ‌గ‌ప‌తిబాబు అవార్డ్ అందుకుంటున్నాడు. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా లెజెండ్ కు బోయ‌పాటి శీను నంది అందుకున్నాడు. ఉత్త‌మ తొలిచిత్ర ద‌ర్శ‌కుడిగా కార్తికేయ చిత్రానికి చందూ మొండేటి అందుకున్నాడు. ఇక 2014 ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా సాయిశ్రీ‌రామ్.. సంగీత ద‌ర్శ‌కుడిగా అనూప్ రూబెన్స్ అవార్డులు సొంతం చేసుకున్నారు.