గుణ‌శేఖ‌ర్ కు స‌మాధాన‌మేది జీవిత..?

నంది అవార్డుల ర‌చ్చ ఇప్పుడు ఎక్క‌డి వ‌ర‌కు వెళ్లి ఆగుతుందో తెలియ‌ట్లేదు. రోజుకొక్క‌రు ర‌చ్చ చేస్తూనే ఉన్నారు. గుణ‌శేఖ‌ర్ ఈ విష‌యాన్ని అంద‌రికంటే ముందు రైజ్ చేసారు. ఆయ‌న వాద‌న‌లో నిజం కూడా లేక‌పోలేద‌ని చాలా మంది చెబుతున్నారు. అవార్డులంటే ఒక‌ప్పుడు ప్ర‌తిభకు కొల‌మానంగా వ‌చ్చేవి. అవి వ‌చ్చిన‌పుడు నిజంగానే తాము ప‌డ్డ క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ద‌క్కింద‌ని సంతోషించే వాళ్లు ద‌ర్శ‌క నిర్మాత‌లు.. హీరోలు. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. అంతా మారిపోయింది. ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌ట్ట‌డం కాదు.. కావాల్సిన వాళ్ల‌కు అవార్డుల‌ను క‌ట్ట‌బెడుతున్నార‌నే విష‌యాన్ని సుస్ప‌ష్టంగా చెప్పాడు గుణ‌శేఖ‌ర్.

ప్ర‌భుత్వాన్ని ఈయ‌న అడిగిన ప్ర‌శ్న‌లు ఎవ‌రికీ న‌చ్చ‌డం లేదు. ఈ విష‌యంలో త‌న ఆవేద‌న‌ను జ్యూరి ఛైర్మెన్ జీవిత అప‌హాస్యం చేయ‌డంపై చాలా బాధ ప‌డుతున్నాడు గుణ‌శేఖ‌ర్. రుద్ర‌మ‌దేవి సినిమాను వాళ్లు క‌నీసం క‌న్సిడ‌ర్ చేయ‌క‌పోవ‌డంపై చాలా నిరుత్సాహంతో ఉన్నాడు. ఆయ‌న సినిమా ఎందుకు అవార్డుల‌కు ప‌నికిరాదో చెప్పాలంటూ ప‌ట్టుబ‌ట్టాడు. దీనికి 2015 జ్యూరి ఛైర్మెన్ జీవిత ఇచ్చిన స‌మాధానం అంత బాగోలేద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. 40 సినిమాలు వ‌చ్చాయి అవార్డుల‌కు అన్ని చూసే ఓపిక ఎవ‌రికి మాత్రం ఉంటుంది.. అయినా అన్ని సినిమాల‌కు అవార్డులు రావు క‌దా.. రాని వాళ్లు ఇలా చేస్తే క‌రెక్ట్ కాదు.. రుద్ర‌మ‌దేవి కంటే బాహుబ‌లి మాకు బాగా అనిపించింది.. అందుకే దానికి ఇచ్చాం అంది జీవిత. ఈమె మాట‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి.

బాధ్య‌తాయుత ప‌ద‌విలో ఉండి.. రుద్ర‌మ‌దేవి సినిమాను చూడ‌లేద‌నే ప‌రోక్షంగానే ఒప్పుకున్నారు జీవిత. క‌నీసం సినిమా చూడ్డానికి కూడా ఓపిక లేక‌పోతే ఎందుకు జ్యూరీలో ఉండ‌టం అంటున్నారు కొంద‌రు. దీనికి ఆమె స‌మాధానం ఏం చెప్తుందో చూడాలిక‌. రుద్ర‌మ‌దేవి సినిమాను త‌నే క‌ష్ట‌ప‌డి నిర్మించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు గుణ‌శేఖ‌ర్. నానా తంటాలు ప‌డి రిలీజ్ చేసాడు. కానీ ఈ సినిమాకు క‌నీస గుర్తింపు ఇవ్వ‌క పోవ‌డం నిజంగానే బాధాక‌రం అంటున్నారు విశ్లేష‌కులు. జీవిత ఇప్పుడు టీడిపిలో చేరింది. అక్క‌డ చంద్ర‌బాబు.. ఇక్కడ బాల‌య్య.. దృష్టిలో పడటానినికి జీవిత ఇలా చేసింది అనే విమర్శ కూడా ఉంది. ఒకవేళ పదవి ఆశించి జీవిత ఇలా చేసిందనుకోండి ఆమె పేడలో కాలు వేసినట్టే ఎందుకంటే ఇప్ప‌టికిప్పుడు జీవిత‌కు ఇవ్వ‌డానికి టీడిపిలో ప‌ద‌వులు కూడా లేవు. అయినా గుణశేఖర్ వాదనలో న్యాయం ఉన్నా లేకపోయినా రుద్రమదేవి సినిమాకి అప్పుడే అవార్డు ఇవ్వదలచుకొంటే జ్యురీ సభ్యులకి పెద్ద విషయమా చెప్పండి.