ఆవిడ లేక‌పోతే బేబి లేదు!

Last Updated on by

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రాని’కి రీమేక్ రూప‌మ‌ది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. నందినిరెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్నారు.సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ 5న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా నందినిరెడ్డి సినిమా విశేషాల‌ను పంచుకున్నారు. ఆ వేంటో ఆ మె మాట‌ల్లోనే…

మేము అంతా బాగా కనెక్ట్ అయిన కథ. ఆ కథను నిజాయితీగా తీశామనే నమ్మకం ఉంది. అన్నిటికి మించి మనందరికీ మన జీవితాల్లో మదర్ ఎమోషన్ ఎంతో కీలకమైనది. ఆ ఎమోషనే ఈ సినిమాలో హైలెట్ గా ఉంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కొన్ని రోజులు పాటు గుర్తుండిపోతుంది సినిమా. ముందుగా సమంతనే ఈ సినిమాని నా దగ్గరకి తీసుకొచ్చింది. ఇక తెలుగులో ఈ సినిమా చెయ్యటానికి కారణం కొరియన్ మూవీని మన తెలుగు వాళ్ళు ఎంతమంది చూసి ఉంటారు. ఇది మనందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. అందుకే రీమేక్ చేశాం.సమంత తప్ప బేబీ పాత్రలో ఇంత గొప్పగా ఇంకెవ్వరూ చెయ్యలేరేమో అనేంత స్థాయిలో తను ఈ సినిమాలో నటించింది. తను నటిచడంతో పాటు స్క్రిప్ట్ లో కూడా బాగా ఇన్ వాల్వ్ అయింది. ల‌క్ష్మి గారు ఈ సినిమా చెయ్యకపోతే బహుశా సమంత , నేను ఈ సినిమా చేసి ఉండేవాళ్ళం కాదేమో. ఎందుకంటే.. ఆవిడ చేసిన పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ పండించాలంటే ఖచ్చితంగా గొప్పనటి నటించాలి.

నాకు ఇక లక్ష్మిగారు తప్ప ఇంకెవరూ కనిపించలేదు. నిజంగా ఆవిడ మహానటి. కథ అంత త్వరగా నాకు నచ్చదు. నేను ఒక మూడు నెలలు ఒక కథ రాసాక అది నాకు నచ్చదు. అలా లేట్ అవుతూ ఉంటుంది. సినిమా అయితే చాల తక్కువ టైంలోనే తీస్తాను. స్క్రిప్ట్ వల్లే నాకు గ్యాప్ వస్తోంది.వైజయంతి బ్యానర్ లో ఒక సినిమా ఉంది. ఆల్ రెడీ రెండు కథలు ఓకే అయ్యాయి. మల్టీస్టారర్ ఒకటి, ఎంటర్ టైనర్ జోనర్ లో మరొకటి. ఈ రెండిట్లో ఏదో ఒకటి నా తరువాత సినిమాగా ఉంటుంది.

Also Watch: Oh Baby Pre -Release Event