ఓ బేబి ద‌ర్శ‌కురాలు నెక్ట్స్ ఏంటి?

Nandini Reddy - FIle Photo

2018లో `మ‌హాన‌టి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని నిర్మించిన సంస్థ స్వ‌ప్న‌సినిమా సంస్థ ఆ త‌ర్వాత ఎందుక‌నో సైలెంట్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సైలెన్స్ వెన‌క అస‌లు అర్థ‌మేంటో తెలిసింది. ఇక‌పై ఇందులో అన్నీ కాన్సెప్ట్ బేస్డ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే తెర‌కెక్కిస్తార‌ట‌. ప్ర‌స్తుతం ఈ బ్యాన‌ర్‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. దీంతో పాటు ఓబేబి ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డితోనూ ఈ బ్యాన‌ర్‌లో మ‌రో సినిమా రూపొంద‌నుంది.

సంస్థ అధినేత‌లు ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్ ఇప్ప‌టికే ప్రణాళిక‌ను సిద్ధం చేశారు. ఈ ఏడాది `ఓ బేబీ` చిత్రంతో నందినీ రెడ్డి సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను సాధించింది. ఇప్పుడు ఈమె ప్రియాంక ద‌త్ నిర్మాణంలో కాంటెంప‌ర‌రీ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించ‌నున్నారని ప్ర‌క‌టించారు. `మ‌హాన‌టి`, `ఓ బేబీ` చిత్రాల‌కు అద్భుత‌మైన సంగీతాన్ని అందించిన మిక్కీ జె.మేయ‌ర్ ఈ సినిమాకు సంగీత సార‌థ్యం వ‌హించ‌నున్నారు. ల‌క్ష్మీ భూపాల్ ర‌చయిత‌గా ప‌నిచేస్తున్నారు. జ‌య‌శ్రీ ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తుండ‌గా.. రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అటు నందిని రెడ్డి, ఇటు ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్న ద‌త్ నిర్మించిన చిత్రాల‌న్నీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే. అన్నీ చ‌క్క‌ని చిత్రాలే. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో రాబోతున్న ఈ సినిమా కూడా ఓ మ్యాజిక్‌ను క్రియేట్ చేయ‌నుంది. త్వ‌ర‌లోనే సినిమా ప్రారంభం కానుంది. ద‌త్ జీ కాంపౌండ్ తో పాటు నందిని రెడ్డి డిజిట‌ల్ వెబ్ సిరీస్ ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌ప‌తిబాబు- అమ‌లాపాల్ న‌టీన‌టులుగా ల‌స్ట్ స్టోరీస్ ని తెలుగైజ్ చేస్తున్నారు.

ల‌స్ట్ స్టోరీస్ తెలుగులోనూ..

భార‌తీయ తెర‌పై వెబ్ సిరీస్ సంచ‌ల‌నం ల‌స్ట్ స్టోరీస్‌.. దేశ వ్యాప్తంగా చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. భావ ప్రాప్తి అనే పాయింట్‌ని తీసుకుని నాలుగు బుల్లి క‌థ‌ల‌ని క‌లుపుతూ ఓ సినిమాని తెర‌పైకి తీసుకొచ్చారు  ఇప్ప‌డు ఈ సిరీస్ ని తెలుగులో రీమేక్ చేయాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.  నాలుగు విభిన్న‌మైన క‌థ‌ల నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఒక్కో స్టోరీని ఒక్కో ద‌ర్శ‌కుడు తెర‌పైకి తీసుకురాబోతున్నారు. నందినిరెడ్డి, సందీప్‌రెడ్డి వంగ‌, త‌రుణ్‌భాస్క‌ర్‌, సంక‌ల్ప్‌రెడ్డి ఈ నాలుగు భాగాల్ని రూపొందించ‌బోతున్నారు. రిచ్ బాస్‌గా జ‌గ‌ప‌తిబాబు, అత‌నితో ఎఫైర్ న‌డిపించే యువ‌తిగా అమ‌లా పాల్ కనిపించ‌బోతున్నారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప‌డ‌క‌గ‌ది సీన్‌లు హ‌ద్దులు దాటి వుండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే నందిని రెడ్డి త‌న వెర్ష‌న్ కు సంబంధించిన ఏర్పాట్ల‌ని పూర్తి చేసింద‌ని త్వ‌ర‌లో షూటింగ్ మొద‌లుపెట్ట‌బోతోంద‌ట‌. మిగ‌త ముగ్గురు స్క్రిప్ట్‌ల‌కు మెరుగులు దిద్దే పనుల్లో బిజీగా వున్నారు.