నాని విల‌న్.. సుధీర్‌బాబు హీరో?

Last Updated on by

ఛాలెంజింగ్ డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌స్తుతం ఓ మ‌ల్టీస్టార‌ర్ కి స‌న్నాహాలు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. నాని, సుధీర్ బాబు క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా పూర్త‌వుతున్నాయ‌ని తెలుస్తోంది. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే షూటింగ్ ప్రారంభించి, రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఇంద్ర‌గంటికి ఇప్ప‌టికే స్క్రిప్టు విష‌య‌మై పూర్తి క్లారిటీ వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

ఈ చిత్రంలో నాని రోల్ ఏంటి? సుధీర్ బాబు ఎలాంటి పాత్ర పోషించ‌నున్నారు? అన్న‌దానికి తాజాగా స‌మాచారం అందింది. నాని ఈ చిత్రంలో విల‌న్ పాత్ర‌లో న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. సుధీర్ బాబు ఓ ప‌వ‌ర్‌ఫుల్ కాప్ పాత్ర‌లో మెప్పించ‌నున్నార‌ట‌. అంటే సుధీర్ హీరో అయితే, నాని విలన్ గా క‌నిపించ‌బోతున్నార‌న్న‌మాట‌. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా హోరాహోరీ మైండ్ గేమ్.. టిట్ ఫ‌ర్ ట్యాట్ న‌డిచే విధంగా ఇంట్రెస్టింగ్ క‌థ‌ను రాసుకున్నార‌ట‌. నానీతో అష్టా చెమ్మా, జెంటిల్‌మేన్ లాంటి చిత్రాల్ని తెర‌కెక్కించిన ఇంద్ర‌గంటి .. గ‌త ఏడాది సుధీర్ బాబుకు స‌మ్మోహ‌నం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించారు. అందుకే నాని- సుధీర్- ఇంద్ర‌గంటి మల్టీస్టార‌ర్ పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక ఈ సినిమాలో క‌థానాయిక‌లుగా నివేద థామ‌స్, అదితీరావ్ హైద‌రీతో మంత‌నాలు సాగుతున్నాయి. అదితి నాని స‌ర‌స‌న న‌టిస్తోంది. నివేద ఇంకా ఫైన‌ల్ కాలేద‌ట‌. నివేద పారితోషికం విష‌యంలో చిత్ర నిర్మాత‌ దిల్ రాజు మంత‌నాలు సాగిస్తున్నార‌ని తెలుస్తోంది. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

User Comments