అ.. మ‌ళ్లీ అదే ఆశ్చ‌ర్యం..!

Last Updated on by

ఆవలిస్తే పేగులు లెక్క‌పెట్టే ప్రేక్ష‌కులు ఉన్నారు ఇప్పుడు. పోస్ట‌ర్ చూసి సినిమా ఎలా ఉంటుందో చెప్పేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి టైమ్ లో ఓ సినిమా కొత్త క‌థ‌తో వ‌స్తుందంటే న‌మ్మ‌డం కూడా సాధ్యం కాదు. కానీ నాని మాత్రం అలా చేస్తున్నాడు. చెబుతున్నాడు కూడా. అంతేకాదు.. ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి క‌థ‌తో ఏ సినిమా రాలేదంటూ ధైర్యంగా చెబుతున్నాడు. ఇప్పుడున్న కాపీ యుగంలో ఇంత ధైర్యంగా త‌మ సినిమా గురించి చెప్పే ద‌మ్ము ఏ నిర్మాత‌కైనా ఉందా..? ఇలాంటి టైమ్ లో కూడా 8 ఫ‌స్ట్ లుక్ లతో పాటు ఓ టీజ‌ర్ విడుద‌ల చేసి మ‌రీ త‌న సినిమా కొత్త‌గా ఉంటుంది అని ఛాలెంజ్ చేస్తున్నాడు న్యాచుర‌ల్ స్టార్. అలాంటి సినిమా నిర్మిస్తున్నాడు నాని. అందుకే ధైర్యంగా చెప్పాడు ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో ఇలాంటి చిత్రం రాలేదని. రెగ్యుల‌ర్ ప్రొడ్యూస‌ర్లు అయితే ఈ క‌థ‌ను చేయ‌రు కాబ‌ట్టే తానే నిర్మాత‌గా మారానంటున్నాడు నాని.

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు విడుద‌లవుతున్న కొద్దీ సినిమాలో ఏముందో అనే ఆస‌క్తి కూడా పెరుగుతూ వ‌చ్చింది. ఇప్పుడు అది పీక్స్ కు చేరిపోయింది. అ.. టీజ‌ర్ విడుద‌లైన త‌ర్వాత కూడా సినిమాలో ఏముందో అర్థం కాలేదు. అంతగా లాక్ చేసాడు ద‌ర్శ‌కుడు ప్రశాంత్. ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌లైంది. అయినా కూడా ఏమీ అర్థం కాలేదు. కానీ ఆస‌క్తిక‌రంగా మాత్రం ఉంది. అన్ని లుక్కుల చూపించినా కూడా క‌థ మాత్రం రివీల్ చేయ‌లేదు నాని. ఇందులో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీతో పాటు ల‌వ్, కామెడీ, క్రైమ్ అన్నీ క‌నిపిస్తున్నాయి.

ఓ సినిమాలో న‌వ‌ర‌సాలు అంటారు క‌దా అన్నీ ఉన్నాయి ఇందులో. అంతేకాదు.. చేప‌ల‌కు కూడా క‌న్నీళ్లుంటాయి బాస్.. కాక‌పోతే క‌న‌బ‌డ‌వు నీళ్ల‌లో ఉంటాయి క‌దా అనే డైలాగ్ అద్భుతంగా పేలింది. ఈ చిత్రంలో కాజ‌ల్.. నిత్యామీన‌న్.. ఇషారెబ్బా.. అవ‌స‌రాల శ్రీ‌నివాస్.. ప్రియ‌ద‌ర్శి లాంటి వాళ్లంతా న‌టిస్తున్నారు. ఇక ర‌వితేజ చెట్టుగా.. నాని చేప‌గా న‌టిస్తున్నారు ఇందులో. ఫిబ్ర‌వ‌రి 16న సినిమా విడుద‌ల కానుంది. మ‌రి.. అ.. విడుద‌లైన త‌ర్వాత ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతుందో..?

User Comments