జెర్సీతో నాని డ్రీమ్ నెర‌వేరతోందా?

నేచుర‌ల్ స్టార్ నాని పెర్పామెన్స్ గురించి ఎంత చెప్పిన త‌క్కువే. ఎలాంటి పాత్ర‌నైనా స‌హ‌సిద్ధంగా పండించ‌గ‌ల ఏకైక టాలీవుడ్ న‌టుడు. ఎలాంటి క‌థ‌లోనైనా రియ‌ల్ స్టిక్ పెర్పామెన్స్ ఇవ్వ‌డం నానికి వెన్న‌తో పెట్టిన విద్య. అందుకే నేచుర‌ల్ అనే ట్యాగ్ నే త‌న ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. అలాంటి న‌టుడికి స‌హ‌జ‌త్వం ,ఎమోష‌న్ తో కూడిన పాత్ర‌లిస్తే సినిమాకే వ‌న్నె తేగ‌ల న‌టుడు. అమీర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్ లాంటి ఎమోష‌న్ జ‌ర్నీ ఉన్న పాత్ర‌లో న‌టించాల‌ని, అలాంటి రోల్ ఓ డ్రీమ్ లా ఉండిపోయింద‌ని ప‌లు ఇంట‌ర్వూల్లో చెప్పిన సంద‌ర్భాలున్నాయి. తాజాగా `జెర్సీ` సినిమాతో ఆ డ్రీమ్ ను పుల్ ఫిల్ చేసుకోవ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. మాజీ క్రికెట‌ర్ ర‌మ‌ణ్ లాంబా జీవిత క‌థ ఆధారంగా స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో జెర్సీ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఆయ‌న క‌థ‌లో ఎంతో ఎమోష‌న్ ఉంది. బంగ్లాదేశ్ లోని ఢాకా లో బంగబంధు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ బంతి బలంగా తగలడంతో గాయపడి మూడు రోజుల పాటు చావు బ్ర‌తుకుల మ‌ధ్య పోరాడి చివ‌రికి విధి ముందు త‌ల వంచ‌క త‌ప్ప‌లేదు. ఈ క‌థ‌నే క‌మ‌ర్శిలైజ్ చేస్తూ వెండి తెర‌పై దృశ్య‌రూపం ఇస్తున్నాడు గౌత‌మ్ తిన్న‌తూరి. అలాంటి చాలెంజింగ్ రోల్ లో నాని ని ఎంపిక చేసి సినిమా చేస్తున్నారంటే? ఎంత రియ‌ల్ స్టిక్ లుక్ తీసుకొస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. గౌత‌మ్ తీన్న‌నూరి తొలి సినిమా `మ‌ళ్లీ రావా`తోనే మంచి మేక‌ర్ ప్రూవ్ చేసుకున్నాడు. ఎమోష‌న్ ను అద్భుతంగా క్యారీ చేస్తాడు. ఇక నాని పెర్పామెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసే న‌టుడు. ఇప్ప‌టికే జెర్సీ పై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అన్ని చోట్ల పాజిటివ్ బ‌జ్ ఉంది. థియేట్రిక‌ల్ రైట్స్ మంచి ధ‌ర ప‌లుకుతుంద‌ని తెలుస్తోంది. బాక్సాఫీస్ వ‌ద్ద సునాయాసంగా 50 కోట్లు సాధించ‌డం ఖాయ‌మ‌నే ట్రేడ్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.