నాని ఇద్ద‌రితో రొమాన్స్

నేచుర‌ల్ స్టార్ నాని – ఇంద్ర‌గంటి కాంబినేష‌న్ మూవీ `వీ` చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత నాని మ‌రో కొత్త సినిమాకి స‌న్నాహాలు చేస్తున్నారు. శివ నిర్వాణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. విలేజ్ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర క‌థాంశాన్ని శివ రెడీ చేశార‌ట‌. నిన్ను కోరి త‌ర్వాత మ‌రోసారి ఈ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమాగా ట్రేడ్ లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇక ఈ సినిమాకి కాస్టింగ్ ఎంపిక‌లు సాగుతున్నాయి. ఇందులో నాని స‌ర‌స‌న ఇద్ద‌రు భామ‌లు న‌టించ‌నున్నార‌ట‌. అందులో పెళ్లి చూపులు ఫేం రీతు వ‌ర్మ ప్ర‌ధాన నాయిక కాగా.. రెండో నాయిక‌గా కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి ఫేం ఐశ్వ‌ర్య రాజేష్ న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. ఐశ్వ‌ర్య ఈ చిత్రంలో నానీకి మ‌ర‌ద‌లి పాత్ర‌లో న‌టించ‌నుంద‌ట‌. అయితే నాని నాయిక‌ల గురించి అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.