ఆత్మ హ‌త్య చేసుకుంటాం

దుర్గా ప్ర‌సాద్ హీరోగా న‌టించిన చిత్రం నాని గాడు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని రిలీజ్ రెడీ అవుతోన్న నాని గాడి యూనిట్ కి పెద్ద షాక్ త‌గిలింది. సినిమాను ఎవ‌రో యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసారు. దీంతో చిత్ర యూనిట్ షాక్ అయింది. దీంతో హీరో దుర్గాప్ర‌సాద్ ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేసాడు. 40 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి సినిమా చేసా. సెన్సార్ పూర్త‌యింది. సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతోన్న స‌మ‌యంలో మొత్తం సినిమా యూ ట్యూబ్ లో పెట్టేసారు.

ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాం. యూ ట్యూబ్ లో ఆ లింక్ ను తొల‌గింంచేలా తక్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాలి. మాకు న్యాయం జ‌ర‌గ‌క‌పోతే చిత్ర యూనిట్ తో స‌హా బుధ‌వారం ఛాంబ‌ర్ వ‌ద్ద ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని హెచ్చ‌రించాడు. మ‌రి దీనిపై ఛాంబ‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. ఇప్ప‌టికే చాంబ‌ర్ లో సైబ‌ర్ పోలీసుల‌కు అనుబంధంగా ఓ వింగ్ ప‌నిచేస్తోన్న సంగ‌తి తెలిసిందే.