గ్యాంగ్ లీడ‌ర్ మూవీ రివ్యూ

Nani-gang-leader-Telugu-movie-review-Rating

న‌టీన‌టులు: నాని, కార్తికేయ‌, ప్రియాంక‌, ల‌క్ష్మి, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
బ్యాన‌ర్‌: మైత్రి మూవీ మేక‌ర్స్
నిర్మాత‌: న‌వీన్ ఎర్నేని, సి.వి.మోహ‌న్, ర‌వి
సంగీతం: అనిరుధ్ ర‌విచంద్ర‌న్
ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: విక్ర‌మ్.కె.కుమార్

ముందు మాట:
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం `గ్యాంగ్ లీడర్`. కార్తికేయ కీల‌క పాత్ర‌ధారి. విలక్షణ చిత్రాల దర్శకుడు విక్రమ్.కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించారు. కామెడీ, సస్పెన్స్ ఎంట‌ర్ టైన‌ర్ చిత్ర‌మిది. ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ తో మ‌రోసారి విక్ర‌మ్.కె మార్క్ లాజిక్ ఉన్న ఫ‌న్నీ ఎంట‌ర్ టైన‌ర్ ఇద‌ని అర్థమైంది. అయితే సినిమా ఆద్యంతం ఫ‌న్ వ‌ర్క‌వుటైందా లేదా? అస‌లు విక్ర‌మ్.కె మార్క్ లాజిక్ ఏమేర‌కు క‌నెక్ట‌య్యింది? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

సింగిల్ లైన్‌:
త‌మ బంధువుల చావుకు కార‌కుడైన మోస‌గాడిపై ప‌గ తీర్చుకునేందుకు బ‌యల్దేరిన ఐదుగురు లేడీ గ్యాంగ్ ని నాని ఎలా లీడ్ చేశాడ‌న్న‌దే ఈ సినిమా థీమ్.

క‌థ‌నం అనాలిసిస్‌:
ఓ బ్యాంక్ దొంగ‌త‌నంలో ఐదుగురిని మోసం చేసి ఆరోవాడు ఆ డ‌బ్బుతో పారిపోతాడు. ఆ ఐదుగురు హ‌తం కాగా వెన్నుపోటు దొంగ‌ పోలీసుల ఛేజ్ లో ఎస్కేప్ అవుతాడు. చ‌నిపోయిన ఆ ఐదుగురి బంధువులు (ఐదుగురు లేడీస్) హీరో నాని సాయంతో వెన్నుపోటు దారిడిని వెతికి ప‌ట్టుకున్నారా లేదా? చివ‌రికి ప‌గ తీర్చుకున్నారా లేదా? అన్న‌దే సినిమా క‌థాంశం. హాలీవుడ్ సినిమాలు కాపీ కొట్టి క‌థ‌లు రాసే పెన్సిల్ పార్థ‌సార‌థి (నాని) ఆ ఐదుగురికి ఎలాంటి సాయం చేశాడు? అస‌లు ఆ మోస‌గాడి(కార్తికేయ‌)ని ఛేజ్ చేసి ప‌ట్టుకున్నారా లేదా? చివ‌రికి రిజ‌ల్ట్ ఏమిటి అన్న‌దే సినిమా.

ఆ ఐదుగురిలో ప్రియాంక అందానికి ఆక‌ర్షితుడై ప్రేమ‌లో ప‌డ‌తాడు పెన్సిల్ పార్థ‌సార‌థి. ల‌క్ష్మితో పాటు ఇత‌ర గ్యాంగ్ నానీతో చేసే ట్రావెలింగ్ లో కామెడీ .. ఫన్ ఎలిమెంట్స్ తో న‌డిచే డ్రామా ఇది. ఇందులో ప్రియాంక‌తో ల‌వ్ .. రొమాన్స్ .. సాంగ్స్ అద‌నం. అలా ఈ గ్యాంగ్ వెతుకుతూ వెళ్లి వెన్నుపోటు దారుడైన కార్తికేయ నుంచి ఏదోలా డ‌బ్బు కొట్టేశాక రివ‌ర్స్ ఛేజ్ మొద‌ల‌వుతుంది. కార్తికేయ‌ ఈ ఆరుగురిని వెంటాడుతాడు. అయితే ఈ ట్రావెలింగ్ లో ప్రేక్ష‌కులు ఆశించిన విక్ర‌మ్.కె మార్క్ లాజిక్ ఉందా అంటే.. అది ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం పెద్ద బోరింగ్. ఫ‌స్టాఫ్ అంతంత మాత్ర‌మే.. క‌నీసం సెకండాఫ్ లో అయినా స్క్రీన్ ప్లే ప‌రంగా ఏదైనా మ్యాజిక్ చేశాడా అంటే అదీ క‌నిపించ‌దు. అలాగే చివ‌రి 20 నిమిషాల సినిమా ప‌ర‌మ రొటీనిటీతో చికాకు పుట్టిస్తుంది. ఎప్ప‌టిలానే నేచుర‌ల్ స్టార్ నాని సినిమా ఆద్యంతం త‌న న‌ట‌న‌తోనే నెట్టుకొచ్చాడ‌న్న భావ‌న తొప్ప ఇంకేదీ ఆస‌క్తిక‌ర ఎలిమెంట్ లేక‌పోవ‌డం నిరాశ‌ప‌రుస్తుంది. అక్క‌డ‌క్క‌డా ఫ‌న్ ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ క‌థాంశం వీక్. ప‌తాక స‌న్నివేశాలు రొటీన్ గా తేలిపోయాయి. మ‌రోసారి మైత్రి మూవీ మేక‌ర్స్ ఎఫ‌ర్ట్ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఫెయిల్ అనే చెప్పాలి.

న‌టీన‌టులు:
సినిమా ఆద్యంతం నేచుర‌ల్ స్టార్ నాని త‌న భుజ‌స్కంధాల‌పై న‌డిపించాడు. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి త‌న ప‌ని తాను చేసుకుపోయింది. ప్రియాంక మోహ‌న్ హీరోయిన్ మెటీరియ‌ల్ కానే కాదు. కార్తికేయ పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించాడు. వెన్నెల కిషోర్, ప్రియ‌ద‌ర్శి పాత్ర‌ల కామెడీ సోసోనే.

టెక్నికాలిటీస్:
మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణ విలువ‌లు గుడ్. ద‌ర్శ‌కుడిగా విక్ర‌మ్.కె త‌న‌దైన మార్క్ వేయ‌డంలో మ‌రోసారి విఫ‌ల‌మ‌య్యారు. సినిమాటోగ్ర‌ఫీ ఓకే. రీరికార్డింగ్ ఫ‌ర్వాలేదు. పాట‌లు సోసోనే.

ప్ల‌స్ పాయింట్స్‌:
*ఎంచుకున్న క‌థాంశం
* నాని న‌ట‌న‌
* ఫ‌న్ ఎలిమెంట్‌

మైన‌స్ పాయింట్స్‌:
* రొటీన్ స్క్రీన్ ప్లే..
* విక్ర‌మ్.కె. మార్క్ లాజిక్స్ లోపించ‌డం
* క్యూరియాసిటీ పెంచే సీన్లు లేక‌పోవ‌డం

ముగింపు:
బోర్ కొట్టించే గ్యాంగ్ లీడ‌ర్

రేటింగ్‌:
2.5/5