సునీల్ కు సాయం చేస్తున్న నాని..

సునీల్ ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నాడో అంద‌రికీ తెలిసిందే. ఒక్క హిట్ అంటూ వేచి చూస్తున్నాడు. ఇప్పుడు ఈయ‌న ఆశ‌ల‌న్నీ 2 కంట్రీస్ పైనే ఉన్నాయి. డిసెంబ‌ర్ 29న ఈ చిత్రం విడుద‌ల కానుంది. తాజాగా సినిమా ఆడియో వేడుక జ‌రిగింది. హైద‌రాబాద్ లోని ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగిన ఈ వేడుక‌కు నాని ముఖ్య అతిథిగా వ‌చ్చాడు. సునీల్ కు స‌పోర్ట్ చేయ‌డానికి నాని కూడా త‌న‌వంతు సాయం చేస్తున్నాడు.
ఎన్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో సునీల్ ప‌ల్లెటూరి అబ్బాయిగా న‌టిస్తున్నాడు. ఓ ప‌ల్లెటూరి అబ్బాయికి.. అమెరికా అమ్మాయికి పెళ్లి జ‌ర‌గ‌డం.. ఆ త‌ర్వాత వాళ్లిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే విభేధాలే సినిమా క‌థ‌. మ‌ళ‌యాలంలో సూప‌ర్ హిట్టైన 2 కంట్రీస్ కు తెలుగు రీమేక్ ఇది. సునీల్ కెరీర్ ఇప్పుడు నిలబ‌డాలంటే ఈ చిత్రం క‌చ్చితంగా ఆడాల్సిందే మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. అందుకే ప్ర‌మోష‌న్ లోనూ వేగం పెంచేసాడు సునీల్. ఎన్ శంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2 కంట్రీస్ అయినా సునీల్ క‌ష్టాల‌ను గ‌ట్టెక్కిస్తుందో లేదో..?